Home / తప్పక చదవాలి
జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ , బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ ఛైర్మన్ డా.లక్ష్మణ్ పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ నివాసంలో ఈ సమావేశం జరిగింది.
సీపీఎం తెలంగాణ ఎన్నికల్లో పోటీచేసే 14మంది అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. కాంగ్రెస్ తో పొత్తు ఖరారు కాకపోవడంతో ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమయింది. పాలేరులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పోటీ చేయనున్నారు. సత్తుపల్లిలో భారతిని బరిలోకి దింపనున్నారు.
శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలను అందరి సహకారంతో విజయవంతంగా నిర్వహించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్లో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది.
సోనియా గాంధీ వల్లే తెలంగాణ కల సాకారమైందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ సాధనలో కాంగ్రెస్‌ది కీలక పాత్రని అన్నారు. తెలంగాణ ఇస్తే ఏపీలో కాంగ్రెస్ బతకదని తెలిసినా తాము రాష్ట్రాన్ని ప్రకటించామని తెలిపారు. శుక్రవారం బషీర్‌బాగ్‌లో జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మజ్లిస్ అధినేత అసదుద్ధీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మజ్లిస్ పార్టీ బలం నీకు తెలియదు మా బలాన్ని గుర్తించి మీ నానమ్మ ఇందిరాగాంధీ దారుసలాంకు వచ్చిందన్నారు. ఈ గడ్డం టోపీదారులే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్తారని మండిపడ్డారు
FTX వ్యవస్థాపకుడు సామ్ బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ క్రిప్టోకరెన్సీ మార్పిడితో కస్టమర్లను మోసం చేసినందుకు గురువారం కోర్టు దోషిగా తేల్చింది.మాన్‌హట్టన్ ఫెడరల్ కోర్టులోని 12 మంది సభ్యుల జ్యూరీ, ఒక నెలరోజుల విచారణ తర్వాత అతను ఎదుర్కొన్న మొత్తం ఏడు ఆరోపణలపై అతనిని దోషిగా నిర్ధారించింది.అతనికి గరిష్టంగా 110 సంవత్సరాల జైలు శిక్షపడే అవకాశం ఉంది.
Delhi: ఢిల్లీలో మరోసారి కాలుష్య తీవ్రత ప్రమాదస్థాయికి చేరింది. శుక్రవారం తెల్లవారుజామున నగరంలోని చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత ‘తీవ్ర ప్రమాదస్థాయి’కి చేరుకుంది. మొత్తంగా సెంట్రల్ పొల్యూషన్ బోర్డు గణాంకాల ప్రకారం వాయునాణ్యత సూచీ 346గా నమోదయింది.
బిగ్ బాస్ OTT 2 విజేత మరియు యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ నిర్వహించిన రేవ్ పార్టీలకు పాములు, వాటి విషాన్ని సరఫరా చేసినందుకు ఐదుగురు వ్యక్తులను నోయిడాలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఢిల్లీ మరియు దాని పరిసర ప్రాంతాల్లోని వివిధ ఫామ్‌హౌస్‌లలో ఈ పార్టీలు నిర్వహించారు.
ఉత్తర ఇరాన్‌లోని మాదకద్రవ్యాల పునరావాస కేంద్రంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో సుమారుగా 32 మంది మరణించగా 16 మంది గాయపడ్డారు.గిలాన్‌లోని కాస్పియన్ సీ ప్రావిన్స్‌లోని లంగర్డ్‌లోని ఓపియం పునరావాస శిబిరంలో అగ్నిప్రమాదానికి గల కారణాలపై న్యాయవ్యవస్థ విచారణ జరుపుతోందని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్ద తెలిపింది.
మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడంపై కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ నివేదిక ఇచ్చింది. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడానికి ప్రధాన కారణం.. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటెనెన్స్ ఇలా నాలుగు అంశాల్లో చెందడంవల్లే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిందని కేంద్ర కమిటీ స్పష్టం చేసింది.