Home / తప్పక చదవాలి
పాకిస్థాన్ పౌరులు లామినేషన్ పేపర్ కొరత కారణంగా కొత్త పాస్‌పోర్ట్‌లను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశం యొక్క డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇమ్మిగ్రేషన్ & పాస్పోర్ట్స్ (DGI&P) ప్రకారం, పాస్‌పోర్ట్‌లలో ఉపయోగించే లామినేషన్ పేపర్ ఫ్రాన్స్ నుండి దిగుమతి అవుతుంది. ప్రస్తుతం దాని కొరత కారణంగా కొత్త పాస్‌పోర్ట్‌లు నిలిచిపోయాయి.
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వాలో లష్కరే తోయిబా (ఎల్ఈటీ) కమాండర్ అక్రమ్ ఖాన్ ఘాజీని శుక్రవారం బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ హత్యలో స్థానిక ప్రత్యర్థి గ్రూపుల హస్తం మరియు ఎల్ఇటిలోని అంతర్గత పోరు వుందని పాకిస్తాన్ నిఘా ఏజెన్సీలు భావిస్తున్నాయి.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. డిసెంబర్ 4వ తేదీ నుంచి 22 వరకు మొత్తం 19 రోజులు 15 సిట్టింగులతో ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X ద్వారా వెల్లడించారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 15కి వాయిదా పడింది. నేటి విచారణకి అదనపు ఏజీ హాజరు కాలేకపోతున్నట్లు ప్రత్యేక పిపి వివేకానంద తెలిపారు.
దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన ‘క్యాష్ ఫర్ క్వెరీ’ వ్యవహారంలో తాజాగా ఊహంచని పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంట్లో ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు, బహుమతులు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కుంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా పై వేటు పడింది.
ప్రజా ప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులను త్వరితగతిన పరిష్కరించే బాధ్యతను హైకోర్టులకు అప్పగిస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం హైదరాబాద లో మైనార్టీ డిక్లరేషన్‌ను విడుదల చేసారు. ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి ఏడాదికి రూ.4 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తామన్నారు. ప్రత్యేక మైనారిటీ సబ్ ప్లాన్ కింద సబ్సిడీ రుణాలు ఇవ్వడానికి ఏడాదికి రూ.వెయ్యి కోట్లు మంజూరు చేస్తామన్నారు.
గాజా స్ట్రిప్‌లో యాంటీ ట్యాంక్ క్షిపణి కార్యకలాపాలకు బాధ్యత వహించిన సీనియర్ హమాస్ కమాండర్‌ను తొలగించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ( ఐడిఎఫ్ ) గురువారం ప్రకటించింది.సెంట్రల్ క్యాంప్స్ బ్రిగేడ్ అని పిలవబడే హమాస్ యొక్క యాంటీ-ట్యాంక్ క్షిపణి శ్రేణికి అధిపతి ఇబ్రహీం అబు-మగ్సిబ్ను సైన్యం తొలగించిందని ఐడిఎఫ్ తెలిపింది.
గాజా నగరాన్ని చుట్టుముట్టిన ఇజ్రాయెల్ సేనలు ఉత్తర గాజాను ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా ఇజ్రాయెల్ సైనికులు గాజా పౌరులను హెచ్చరించాయి. దీనితో వేలాది మంది పాలస్తీనా పౌరులు పిల్లాపాపాలను తీసుకుని చేతిలో తెల్ల జెండాలను పట్టుకొని దక్షిణాది ప్రాంతాలకు గుంపులు గుంపులుగా తరలివెళుతున్నారు.
యూట్యూబర్ మరియు బిగ్ బాస్ OTT 2 విజేత ఎల్విష్ యాదవ్ కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది నోయిడాలోని ఒక పార్టీలో పాము విషాన్ని ఉపయోగించారనే అ నుమానంతో జరిగిన విచారణలో బాలీవుడ్ గాయకుడు ఫాజిల్పురియా ఈ పాములను ఏర్పాటు చేసినట్లు ఎల్విష్ చెప్పాడని సమాచారం.