Home / తప్పక చదవాలి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి (ఆర్కే) పార్టీకి తన పదవికి రాజీనామా చేశారు. స్సీకరి్ తమ్మినేని సీతారాంకి తన రాజీనామా లేఖని పంపించారు. కొంతకాలంగా పార్టీ అధిష్టానం పట్ల ఆళ్ళ రామకృష్ణారెడ్డి అసంతృప్తితో ఉన్నారు. దీనితో స్పీకర్ ఫార్మాట్లొ రాజీనామా లేఖని ఆళ్ళ రామకృష్ణారెడ్డి సమర్పించారు.
ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టు వరద తాకిడికి రెండో గేటు కొట్టుకుపోయింది. దీంతో ప్రాజెక్టునుంచి నీరు వృథాగా పోతోంది.యుద్ధ ప్రాతిపదికన ఇంజనీరింగ్ అధికారులు స్టాప్ లాక్స్ పెట్టినా ఫలితం లేకుండా పోయింది. నీరు ఆగకపోవడంతో... మూడు గేట్లుఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు.
ఇరాక్‌లోని అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా క్షిపణి దాడులు జరిగాయి. కార్యాలయం కాంపౌండ్ లోపల సుమారు ఏడు మోర్టర్ రౌండ్లు పడ్డాయని అమెరికా మిలిటరీ అధికారులు వెల్లడించారు. ఇరాక్‌లో ఈ మధ్య కాలంలో అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా జరిగిన అతిపెద్ద దాడిగా ఈ క్షిపణి దాడిని అభివర్ణించారు.
బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన అధికారిక నివాసం డోర్ లాక్ అయ్యింది. దీంతో డచ్ ప్రధానితో కలిసి కొంతసేపు ఆ డోర్ బయట ఆయన వేచి ఉండాల్సి వచ్చింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. డచ్ ప్రధాన మంత్రి మార్క్ రుట్టే బ్రిటన్ సందర్శించారు.
బీహార్‌లోని నలంద జిల్లా పావపురిలోని వర్ధమాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లోని నలుగురు వైద్యులు మరియు ఒక క్లర్క్‌పై పోలీసులు శుక్రవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరు వైవా పరీక్షలలో మెరుగైన గ్రేడ్ల కోసం కనీసం ముగ్గురు విద్యార్దినుల నుండి లైంగిక ప్రయోజనాలను డిమాండ్ చేశారు. దీనిపై విచారణకు నలంద జిల్లా యంత్రాంగం ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
:ఐసిస్ ఉగ్రవాద కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కర్ణాటక మరియు మహారాష్ట్రలోని 44 చోట్ల దాడులు నిర్వహించి మొత్తం 15 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు శనివారం తెలిపారు.ఈ ఉదయం నుంచి ఎన్ఐఏ దాడులు చేస్తున్న మొత్తం 44 ప్రాంతాల్లో కర్ణాటకలో 1, పూణెలో 2, థానే రూరల్‌లో 31, థానే సిటీలో 9, భయందర్‌లోని 1 చోట ఎన్ఐఏ సోదాలు చేసినట్లు సమాచారం.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం పరిమితి పదిలక్షలకు పెంపు, మహిళలకి మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం పథకాలని ప్రారంభించారు. ఆరోగ్య శ్రీ లోగో, పోస్టర్ని సిఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
తెలంగాణ మూడో శాసనసభ కొలువుదీరింది. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయించారు.మొదట సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత మిగతా ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు.
ఇరాక్‌లోని ఉత్తర నగరమైన ఎర్బిల్‌కు సమీపంలో ఉన్న యూనివర్శిటీ డార్మిటరీలో మంటలు చెలరేగడంతో 14 మంది మరణించగా, 18 మంది గాయపడ్డారు. ఎర్బిల్‌కు తూర్పున ఉన్న సోరన్ అనే చిన్న నగరంలోని ఒక భవనంలో మంటలు చెలరేగాయని సోరన్ హెల్త్ డైరెక్టరేట్ హెడ్ కమరం ముల్లా మహమ్మద్ తెలిపారు.
సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా గాంధీ భవన్లో పుట్టినరోజు ఘనంగా జరిగాయి. గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేక్ కట్ చేసి సోనియాగాంధీకి విషెస్ తెలిపారు. ముఖ్యమంత్రిగా ఎన్నికైన తరువాత మొదటిసారి రేవంత్ రెడ్డి గాంధీభవన్ రావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. సోనియా గాంధీకి 78 వ పుట్టిన రోజు సందర్భంగా రేవంత్ రెడ్డి 78 కిలోల కేక్ కట్ చేశారు.