Home / తప్పక చదవాలి
టిఎస్పిఎస్సి చైర్మన్ జనార్ధన్ రెడ్డి రాజీనామాను తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆమోదించలేదు. పేపర్ లీకేజీకి బాధ్యులు ఎవరో తేల్చకుండా రాజీనామా ఆమోదించకూడదని గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా జనార్దన్‌రెడ్డిని 2021లో అప్పటి కెసిఆర్ ప్రభుత్వం నియమించింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన సూచనల మేరకు సోమవారం 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను మార్చినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.కొత్తగా నియమితులైన ఇన్ఛార్జ్లు మంగళవారం నుంచి పార్టీ కార్యకలాపాలు చూసుకుంటారని తెలిపారు.
ఆస్ట్రేలియా ఇక నుంచి అంతర్జాతీయ విద్యార్థులకు ఇచ్చే స్టూడెండ్స్ వీసాపై కఠినమైన నిబంధనలు అమల్లోకి తేనుంది. దీనితో పాటు దేశంలోకి నైపుణ్యం లేని కార్మికులను రానివ్వమని స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో వలస వాద వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని దాన్ని దారికి తెచ్చుకోవాల్సిన అవసరం ఏంతైనా ఉందని ఆ దేశ హోంమంత్రి క్లెయిరోనిల్ సోమవారం నాడు చెప్పారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు కేసీఆర్ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యులను, వైద్యులను అడిగి అన్ని విషయాలను తెలుసుకున్నారు.
కెప్టెన్ ఫాతిమా వాసిమ్ సియాచిన్ గ్లేసియర్‌లో ఆపరేషనల్ పోస్ట్‌లో నియమించబడిన మొదటి మహిళా మెడికల్ ఆఫీసర్‌గా రికార్డు సృష్టించారు. సియాచిన్ యుద్ధ పాఠశాలలో కఠినమైన శిక్షణ పొందిన తరువాత, ఆమె 15,200 అడుగుల ఎత్తులో ఉన్న ఆపరేషనల్ పోస్టులో నియమిలయ్యారు.
: మధ్యప్రదేశ్ నూతన సీఎంగా మోహన్‌యాదవ్ పేరును బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. గత ప్రభుత్వంలో శివరాజ్‌సింగ్ టీమ్‌లో మోహన్ మంత్రిగా పనిచేశారు. డిప్యూటీ సీఎంలుగా జగదీష్ దేవ్డా, రాజేశ్ శుక్లాలను బీజేపీ అధిష్టానం ప్రకటించింది.
'క్యాష్ ఫర్ క్వరీ' కేసుకు సంబంధించి లోక్‌సభ ఎంపీగా బహిష్కరించబడిన తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నేత మహువా మొయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.తన బహిష్కరణ నిర్ణయం చట్టవిరుద్ధం అంటూ తన పిటిషన్ లో పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహుకు సంబంధించిన ప్రాంతాల్లో ఐటీ దాడులు పూర్తి చేసిన తర్వాత, మొత్తం స్వాధీనం చేసుకున్న నగదు రూ.350 కోట్లుగా తేలింది. ఒడిశాలోని డిస్టిలరీ యూనిట్లలో ఈ నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఒకే ఆపరేషన్‌లో ఐటీ శాఖ స్వాధీనం చేసుకున్న అత్యధిక నగదు ఇదే. పట్టుబడిన కరెన్సీ నోట్ల లెక్కింపు ఐదు రోజుల పాటు కొనసాగింది.
విశాఖ పట్నంలోని నొవాటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎంపీ సత్యనారాయణ ఎంవీబీ వెంచర్ సంబంధించిన రోడ్డును బ్లాక్ చేశారని.. నిరసన వ్యక్తం చేసేందుకు బయలుదేరిన జనసేన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో పాటు, జనసేన కార్యకర్తలు, వీరమహిళలను పోలీసులు అడ్డుకున్నారు.
జమ్ముకశ్మీర్‌కి ప్రత్యేక అధికారాలిచ్చే ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్ధించింది. కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతోపాటు జమ్ముకశ్మీర్ సమానమేనని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది.