Hair Fall: మీ జుట్టు పలుచగా, బలహీనంగా ఉందా?, ఈ మూడు రకాల నూనెలను జుట్టుకు పట్టించండి.. అద్భుతమైన ఫలితాలను చూస్తారు!
![Hair Fall: మీ జుట్టు పలుచగా, బలహీనంగా ఉందా?, ఈ మూడు రకాల నూనెలను జుట్టుకు పట్టించండి.. అద్భుతమైన ఫలితాలను చూస్తారు!](https://s3.ap-south-1.amazonaws.com/media.prime9news.com/wp-content/uploads/2025/02/hair-fall-tips.jpg)
Haif Fall Tips: ప్రస్తుతం కాలంలో చాలా మంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతుంటారు. ముఖ్యంగా చలికాలం ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. చలికాలంలో వీచే చిలి గాలుల వల్ల చర్మం పోడిగా మారుతుంది. జుట్లును కూడా ట్రై చేసి బలహీనం చేస్తుంది. మరోవైపు పొల్యూషన్ వల్ల కూడా హెయిర్ ఫాల్ సమస్యలు వస్తున్నాయి. వీటికి ఎన్నో రెమెడిలు ఉన్నాయి. ఈ బిజీ లైఫ్ కారణంగా వాటిని పాటించడం అందరికి వీలు పడదు. జుట్టు సమస్య అధికంగా ఉన్నవారు ఈ మూడు రకాలు నూనెలు వాడటం వల్ల మంచి ఫలితాలు చూడోచ్చు. జుట్టు రాలే సమస్య మాత్రమే కాదు చుండ్రు నుంచి కూడా మీకు ఈ నూనెల ఉపశమనం ఇస్తాయి. మరి అవేంటో చూద్దాం!
లెమన్ గ్రాస్ ఆయిల్
లెమన్ గ్రాస్ ఆయిల్ జుట్టుకు అద్భుతంగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. జుట్టు రాలు సమస్యను తగ్గించడంతో ఇది బాగా పనిచేస్తుంది. అలాగే చుండ్రు సమస్య ఎక్కువగా ఉన్నవారు ఈ లెమన్ గ్రాస్ నూనెను జుట్టుకు పట్టించాలి. చుండ్రు వల్ల కూడా హెయిర్ ఫాల్ సమస్య బాగా ఉంటుంది. అలాంటపుడు లెమన్ గ్రాస్ ఆయిల్ రాయటం వలన స్కాల్ప్ డ్రైనెస్ అనేది పోతుంది. మంచి పోషణ లభించి జుట్టు పెరుగుతుంది. షాంపూ లేదా కండిషనర్‌లో 4-5 చుక్కల లెమన్‌గ్రాస్ ఆయిల్ కలపి తలకు పట్టిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.
రోజ్‌మేరి ఆయిల్
జుట్టు చాలా బలహీనంగా, మూలాల నుంచి సన్నగా ఉంటే వెంట్రుకలు రాలిపోతాయి. ఇలాంటి సందర్భంలో రోజ్‌మేరి నూనెను జుట్టుకు అప్లై చేసి చూడండి. ఇది జుట్టు ఆరోగ్యంగా పెరగటాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ రోజ్‌మేరి నూనె స్కాల్ప్‌ని గట్టిగా పట్టుకోవడం వల్ల ఇది జుట్టుకు కుదుళ్ల నుంచి పోషణ అందించి జుట్టు రాలటాన్ని అరికడుతుంది. దీంతో క్రమక్రమంగా మీకు ఒత్తైన జుట్టు లభిస్తుంది. అయితే రోజ్‌మేరి నూనెను కొబ్బరి నూనెతో కలిపి అప్లై చేస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. అర టీస్పూన్ కొబ్బరి నూనెలో కొన్ని చుక్కల రోజ్‌మేరీ ఆయిల్ కలపండి. దీన్ని తలకు పట్టించి అరగంట పాటు అలాగే ఉంచాలి. తర్వాత తేలికపాటి షాంపూతో జుట్టును కడగాలి.
గంధపు నూనె
జుట్టు చాలా జిడ్డుగా, జిగటగా ఉంటే కూడా రాలిపోవటానికి . ఇలాంటి జుట్టు కలిగిన వారు గంధపు నూనె రాసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇది తలపై నూనెను ఉత్పత్తి చేసే గ్రంధులను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. దీని వల్ల జుట్టులో దురద, చుండ్రు, జిగట సమస్యలు తీరిపోతాయి. మెరుగైన ఫలితాల కోసం కొబ్బరినూనె లేదా ఆముదం నూనెలో కొన్ని చుక్కల గంధపు నూనెను మిక్స్ చేసి తలకు పట్టించాలి. దీంతో మెరుగైన ఫలితం లభిస్తుంది.