Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రిషి సునక్ అధికారిక నివాసం డోర్ లాక్
బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన అధికారిక నివాసం డోర్ లాక్ అయ్యింది. దీంతో డచ్ ప్రధానితో కలిసి కొంతసేపు ఆ డోర్ బయట ఆయన వేచి ఉండాల్సి వచ్చింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. డచ్ ప్రధాన మంత్రి మార్క్ రుట్టే బ్రిటన్ సందర్శించారు.
Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన అధికారిక నివాసం డోర్ లాక్ అయ్యింది. దీంతో డచ్ ప్రధానితో కలిసి కొంతసేపు ఆ డోర్ బయట ఆయన వేచి ఉండాల్సి వచ్చింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. డచ్ ప్రధాన మంత్రి మార్క్ రుట్టే బ్రిటన్ సందర్శించారు. ఆ దేశ ప్రధాని రిషి సునక్‌ను కలిసి చర్చలు జరిపేందుకు అధికార నివాసం డౌనింగ్ స్ట్రీట్‌కు చేరుకున్నారు. దీంతో రిషి సునక్ బయటకు వచ్చి ఆయనకు స్వాగతం పలికారు.
డచ్ ప్రధానితో కలిసి ..(Rishi Sunak)
కాగా బ్రిటన్ ప్రధాని రిషి సునక్ అధికార కార్యాలయం నంబర్ 10లోకి వెళ్లే డోర్ లాక్ అయ్యింది. అది ఎంతకీ తెరుచుకోలేదు. అయితే మీడియా ఫొటోలు తీస్తుండగా రిషి సునక్, డచ్ ప్రధాని మార్క్ కొంత గందరగోళానికి గురయ్యారు.అనంతరం సునక్ ఆ డోర్‌ను చేతితో తట్టారు. దీనితో లోపలి నుంచి ఆ డోర్ తెరుచుకుంది. ఆ తర్వాత వారిద్దరూ లోనికి వెళ్లారు. అక్రమ వలసలు, రువాండాపై బ్రిటన్ విధానం, మిడిల్ ఈస్ట్, ఉక్రెయిన్ యుద్ధం గురించి ఇరు దేశాధినేతలు చర్చించినట్లు సమాచారం. అయితే బ్రిటన్ ప్రధాని రిషి సునక్ అధికారిక నివాసం డోర్ లాక్ కావడంతో డచ్ ప్రధానితో కలిసి కొంతసేపు బయట వేచి ఉన్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
రిషి సునక్ ప్రాతినిధ్యం వహిస్తున్న కన్జర్వేటివ్ పార్టీ 2024లో ఎన్నికలను ఎదుర్కోవలసి ఉంది. ఇదిప్రతిపక్ష లేబర్ పార్టీ కంటే వెనుకబడి ఉంది.కన్జర్వేటివ్‌లు 2010 నుండి అధికారంలో ఉన్నారు.దీనితో వారిపై వ్యతిరేకత ఉందన్న విషయాన్ని గ్రహించిన సునక్ ఇమ్రిగ్రేషన్ సమస్యను తెరపైకి తీసుకు వచ్చారని భావిస్తున్నారు.