Home / తప్పక చదవాలి
మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ యజమాని రవి ఉప్పల్‌ను దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్‌పోల్ ద్వారా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా అతడిని అదుపులోకి తీసుకున్నారు.ఉప్పల్‌ను భారత్‌కు రప్పించేందుకు దుబాయ్ అధికారులతో భారత్ అధికారులు టచ్‌లో ఉన్నారని ఈడీ తెలిపింది.
ఎయిర్ ఇండియా మంగళవారం క్యాబిన్ సిబ్బంది మరియు పైలట్ల కోసం యూనిఫామ్‌లను ఆవిష్కరించింది. ప్రఖ్యాత డిజైనర్ మనీష్ మల్హోత్రా వీటిని రూపొందించారు.ఎయిర్‌లైన్‌లోని మహిళా క్యాబిన్ సిబ్బంది ఆధునిక టచ్‌తో కూడిన ఓంబ్రే చీరలను ధరిస్తారు, పురుషులు బంద్గాలాలు ధరిస్తారు. కాక్‌పిట్ సిబ్బంది కోసం క్లాసిక్ బ్లాక్ సూట్లను డిజైన్ చేశారు.
లోక్‌సభ నుంచి బహిష్కరించబడిన తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన మహువా మొయిత్రా తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం.లోక్‌సభ హౌసింగ్ కమిటీ ఆమెను తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయమని కోరే ప్రక్రియను ప్రారంభించాలని పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది.
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం తన పదవికి రాజీనామా చేసిన తర్వాత మీడియాను ఉద్దేశించి వెళ్లి తనకోసం ఏదైనా అడగడం కంటే చనిపోవడమే మేలంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన చౌహాన్ భావోద్వేగానికి గురయ్యారు.
జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ఈ నెల 16నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. 16వ తేదీ ఉదయం సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల ముఖ్యనేతలతో సమావేశమవుతారు.
పది రోజుల వరకు తనను కలిసేందుకు ఎవరూ ఆసుపత్రికి రావద్దని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రజలను కోరారు. సోమాజిగూడలోని యశోద హాస్పిటల్స్‌లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఇతర రోగులకు అసౌకర్యం కలుగుతుందని అందువలన ఎవరూ తనను పరామర్శించేందుకు రావద్దని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేసారు.
బీజేపీ అధిష్టానం రాజస్థాన్ నూతన సీఎంగా భజన్‌లాల్ శర్మని అధికారికంగా ప్రకటించింది. చివరి నిమిషంలో భజన్‌లాల్ పేరు తెరమీదకు వచ్చింది. బీదియా కుమారి మరియు ప్రేమ్‌చంద్ బైర్వా లను డిప్యూటీ సీఎంలుగా ప్రకటించారు.
తూర్పు డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో బుకావు నగరంలో కుండపోత వర్షాలతో కొండచరియలు విరిగిపడి ఇళ్లు కూలిపోవడంతో 14 మంది మరణించారు.బాధితులందరూ ఇబాండాలోని బుకావు కమ్యూన్లో మరణించారు. అక్కడ వర్షం కింద కూలిపోయిన తాత్కాలిక ఇళ్లలో చాలా మంది నివసిస్తున్నారని కమ్యూన్ మేయర్ జీన్ బాలెక్ ముగాబో చెప్పారు.
ఇస్లామిక్ మిలిటెంట్లు వాయువ్య పాకిస్థాన్‌లోని పోలీస్ స్టేషన్‌పైకి పేలుడు పదార్థాలతో కూడిన ట్రక్కును ఢీకొట్టడంతో 25 మంది మరణించగా 16 మంది గాయపడ్డారు. ఆత్మాహుతి బాంబర్లు సెక్యూరిటీ కాంపౌండ్‌పైకి చొరబడి, ప్రాంగణంలోని పేలుడు పదార్థాలను పేల్చారు. భద్రతా సిబ్బందిపై కూడా ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు జరిగాయి.
: తెలంగాణలో ఐపిఎస్‌ల బదిలీలు మొదలయ్యాయి. రాచకొండ పోలీస్ కమిషనర్‌గా సుధీర్ బాబుని నియమించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా కొత్తకోట శ్రీనివాస రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సైబరాబాద్ కమిషనర్‌గా అవినాష్ మహంతిని నియమించారు.