Mohan Yadav: మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్‌యాదవ్
: మధ్యప్రదేశ్ నూతన సీఎంగా మోహన్‌యాదవ్ పేరును బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. గత ప్రభుత్వంలో శివరాజ్‌సింగ్ టీమ్‌లో మోహన్ మంత్రిగా పనిచేశారు. డిప్యూటీ సీఎంలుగా జగదీష్ దేవ్డా, రాజేశ్ శుక్లాలను బీజేపీ అధిష్టానం ప్రకటించింది.

Mohan Yadav: మధ్యప్రదేశ్ నూతన సీఎంగా మోహన్‌యాదవ్ పేరును బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. గత ప్రభుత్వంలో శివరాజ్‌సింగ్ టీమ్‌లో మోహన్ మంత్రిగా పనిచేశారు. డిప్యూటీ సీఎంలుగా జగదీష్ దేవ్డా, రాజేశ్ శుక్లాలను బీజేపీ అధిష్టానం ప్రకటించింది.
హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ..( Mohan Yadav)
1965 మార్చి 25న మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జన్మించిన మోహన్ యాదవ్ చాలా ఏళ్లుగా బీజేపీలో కొనసాగుతున్నారు. రాజకీయాలతో పాటు వ్యాపారవేత్తగా కూడా గుర్తింపు పొందారు.మోహన్ యాదవ్ రాజకీయ జీవితం 2013లో ఎమ్మెల్యేగా మొదటి ఎన్నికతో ప్రారంభమయింది. తరువాత 2018 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తిరిగి ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో, మోహన్ యాదవ్ ఉజ్జయిని సౌత్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి చేతన్ ప్రేమనారాయణ్ యాదవ్‌పై 12,941 ఓట్ల తేడాతో విజయం సాధించి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా నిలిచారు. మధ్యప్రదేశ్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అయితే 2020లో అప్పటి కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా, 22 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలోకి మారిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పతనమై బీజేపీ అధికారంలోకి వచ్చింది.
ఇవి కూడా చదవండి:
- Telangana Assembly: కొలువుదీరిన తెలంగాణ మూడో శాసనసభ
- CM Revanth Reddy: మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి