Drugs: హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. పోలీసుల అదుపులో కింగ్ పిన్
Drugs: హైదరాబాద్ లో డ్రగ్స్ నివారణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. సరఫరా మాత్రం ఆడగం లేదు
Drugs: హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ దొరికింది. సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ కోట్లలో ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్ నివారణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. సరఫరా మాత్రం ఆడగం లేదు.
పోలీసుల అదుపులో కింగ్ పిన్
హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ దొరికింది. సైబారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ కోట్లలో ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్ నివారణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. సరఫరా మాత్రం ఆడగం లేదు.
భారీ ఎత్తున డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి.. ఈ ముఠాను అదుపులోకి తీసుకుంది. వీరి నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ సరఫరాలో కింగ్ పిన్ గా ఉన్న చింతా రాకేష్ ను కూడా అరెస్ట్ చేశారు. ఈ ముఠా ఇంజినీరింగ్ విద్యార్ధులను టార్గెట్ చేస్తు.. డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ముఠా ఎంతకాలంగా ఈ దందా చేస్తుంది..? గ్యాంగ్ వెనుక ఎవరెవరు ఉన్నారు? ఏయే ప్రాంతాల్లో డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నారనే కోణంలో పోలీసులు ఆరాతీస్తున్నారు. డ్రగ్ కింగ్ పిన్‌తో పాటు మరో నలుగురు అరెస్టవ్వడంతో మరిన్ని వివరాలు త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశముంది. స్థానికంగా డ్రగ్స్ మాఫియాకు ఎవరు సహాయం అందిస్తున్నారు అనేది విచారణలో తేలనుందని పోలీసులు స్పష్టం చేశారు.