Heat Wave: రాష్ట్ర ప్రజలకు అలెర్ట్.. ఈ నాలుగు రోజులు జాగ్రత్త!
Heat Wave: రాష్ట్రంలో భానుడి ప్రతాపం మెుదలైంది. ఇప్పటికే ఎండవేడిమి ఎక్కువ కాగా.. తాజాగా వాతావరణశాఖ హెచ్చరిక జారీ చేసింది. నాలుగు రోజుల పాటు.. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరుగుతాయని తెలిపింది.
Heat Wave: రాష్ట్రంలో భానుడి ప్రతాపం మెుదలైంది. ఇప్పటికే ఎండవేడిమి ఎక్కువ కాగా.. తాజాగా వాతావరణశాఖ హెచ్చరిక జారీ చేసింది. నాలుగు రోజుల పాటు.. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరుగుతాయని తెలిపింది.
నాలుగు రోజుల పాటు..
రాష్ట్రంలో భానుడి ప్రతాపం మెుదలైంది. ఇప్పటికే ఎండవేడిమి ఎక్కువ కాగా.. తాజాగా వాతావరణశాఖ హెచ్చరిక జారీ చేసింది. నాలుగు రోజుల పాటు.. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరుగుతాయని తెలిపింది. సోమవారం నుంచి ఈ నెల 13 వరకు ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని తెలిపింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. సాధారణం కన్నా 2-4 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
సోమవారం, మంగళవారం ఈ రెండు రోజుల్లో.. కొన్ని జిల్లాల్లో పెరుగుదల ఉంటుందని తెలిపింది. ఆ తర్వాతి రెండు రోజులు రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఈ మేరకు ప్రత్యేక సూచనలు జారీ చేసింది.
సోమవారం సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాలో, 11న ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, 12, 13 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వివరించింది.
నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలంలో 41.9 డిగ్రీలు
రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ఆదివారం 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్ఠంగా నల్గొండ జిల్లా పెద్దఅడిశెర్లపల్లి (పీఏ పల్లి) మండలం ఘన్‌పూర్‌లో 41.9 డిగ్రీల సెల్సియస్ నమోదయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాయుడుపేటలో 41.8, నిర్మల్ జిల్లా దస్తురాబాద్‌లో 41.7 డిగ్రీలు నమోదయింది.