Home / ప్రాంతీయం
Nara Lokesh Visit Kumbh Mela: ఏపీ మంత్రి నారా లోకేష్ ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో పర్యటించారు. కుటుంబ సమేతంగా కుంభమేళకు వెళ్లారు. భార్య బ్రహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో కలిసి కుంభమేళలో పుణ్యస్నానం ఆచరించారు. ఈ సందర్భంగా కుమారుడు, భార్యతో కలిసి దిగిన సెల్ఫీ ఫొటోను షేర్ చేశారు. ఈ ఫోటోని షేర్ చేస్తూ “నిజమైన ఆశీర్వాదం లభించింది” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కాగా ఈ మహా కుంభమేళకు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. కేవలం భారతీయులు మాత్రమే […]
Birthday Celebrations at Telangana Bhavan: తెలంగాణ జాతికి మాజీ సీఎం కేసీఆర్ హీరో అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ 71 వ జన్మదిన వేడుకలను ఆ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు 71కిలోల భారీ కేక్‌ను బీఆర్ఎస్ నాయకులతో కలిసి కేటీఆర్ కట్ చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ కారణజన్ముడు కేసీఆర్ అని అన్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ప్రలు ఆకాంక్షిస్తున్నారన్నారు. కేసీఆర్‌ను […]
Road Accident at Guntur District Three Womens Dead: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పని నిమిత్తం కూలీలను తీసుకెళ్తున్న ఆటోను గుంటూరు జిల్లాలోని నారాకోడూరు-బుడంపాడు గ్రామాల వద్ద ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో అరుణకుమారి, నాంచారమ్మ, సీతారావమ్మ ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో మహిళను గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులంతా చేబ్రోలు […]
Indiramma Houses For Beneficiaries: తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు మేలు చేసేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్మించి ఎవరికీ కేటాయించని డబుల్ బెడ్రూ ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఎల్-2 జాబితాలోని వారికి ఇవ్వాలని యోచిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందిరమ్మ ఇళ్ల జాబితాను ఎల్ 1 సొంత స్థలం ఉన్నా వారు, ఎల్2 స్థలం లేనివారు, ఎల్3 ఇళ్లు ఉన్నా దరఖాస్తు చేసుకున్నావారుగా విభజించింది. […]
Minister Ramanaidu says ap govt Aims To Generate 20 Lakh Jobs In Five Years: వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు 16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీపై తొలి సంతకం చేశారని గుర్తుచేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో […]
KTR open letter to Nirmala Sitharaman by Telangana debts: బీఆర్ఎస్ పదేళ్ల పాలన తర్వాత కూడా తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులతో ప్రజల దశాబ్దాల కష్టాలు తీర్చామన్నారు. తెలంగాణ దశ దిశను మార్చి రాష్ట్రానికి తరగని ఆస్తులు సృష్టించినట్లు చెప్పారు. దేశ చరిత్రలో అత్యధిక అప్పులు […]
APSRTC to operate 3500 special buses for Maha Shivaratri 2025: శివరాత్రి పండుగ వేళ ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. మహా శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా శైవ క్షేత్రాల వద్ద అన్ని సౌకర్యాలతో ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు తెలిపింది. మహా శివరాత్రికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని ఏపీఎస్ఆర్టీసీ అంచనా వేసింది. దీంతో రాష్ట్రంలోని ప్రముఖమైన 99 శైవ క్షేత్రాలకు […]
AP Deputy CM Pawan Kalyan Temples Tour: దక్షిణ భారతదేశ ఆలయాల సందర్శనలో భాగంగా జనసేనాని యాత్ర రెండవ రోజూ విజయవంతంగా సాగింది. ఈ మేరకు ఆయన పళని, తిరుపరంకుండ్రం, మధురై క్షేత్రాలను సందర్శించారు. కుమారుడు అకీరా, టీటీడీ బోర్డు సభ్యులు ఆనందసాయితో ఆయా ఆలయాలకు చేరిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు.. అక్కడి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్శనలో భాగంగా దైవ దర్శనానంతరం పవన్ ఆయా క్షేత్రాల విశేషాలను […]
Meenakshi Natarajan As New Incharge of Telangana Congress: ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పలు రాష్ట్రాలకు ఇన్చార్జిలను ప్రకటించింది. 9 రాష్ట్రాలకు కొత్త ఇన్చార్జిలను ప్రకటించింది. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జిగా మీనాక్షి నటరాజన్ నియమితులయ్యారు. దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్‌ను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. రాహుల్‌గాంధీ టీమ్‌లో కీలకంగా ఉన్న మీనాక్షి తెలంగాణ ఇన్చార్జిగా బాధ్యతలు […]
YS Jagan Reacts on Vallabhaneni Vamsi Arrest: వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని అరెస్ట్‌పై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో సుధీర్ఘ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చట్టానికి, న్యాయానికి చోటు లేకుండా పోయిందని, తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని పేర్కొన్నారు. […]