Home / ప్రాంతీయం
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని ఖుషీ టీం దర్శించుకున్నారు. ఖుషి సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాతలు తమ కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు.
కొద్ది రోజులుగా ఎండ, ఉక్కపోతతో సతమతమవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో ఈ రోజు నుంచి మంగళవారం వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి జారీ చేసిన ఐటి నోటీసుల వివరాలు వెల్లడయ్యాయి. ఆగస్టు 4న జారీ చేసిన నోటీసుల కాపీ ప్రైమ్9 చేతికి చిక్కింది. 2022 సెప్టెంబర్ నెలనుంచి ఆదాయపు పన్ను శాఖ, చంద్రబాబు నాయుడికి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయని తాజా నోటీసుల ద్వారా తేలింది.
కోరుట్ల యువతి దీప్తి హత్య కేసులో మిస్టరీ వీడింది. చెల్లి చందనను హంతకురాలని పోలీసులు తేల్చారు. ఆమెతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడు ప్రియుడు షేక్ ఉమర్ సుల్తాన్‌తో వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుంది.
తమ పార్టీ విలీనంపై కాంగ్రెస్‌తో చర్చలు తుది దశకు వచ్చాయని వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల తెలిపారు. రాజశేఖరరెడ్డిని అపారంగా గౌరవిస్తున్నారు కాబట్టే.. సోనియా, రాహుల్‌తో చర్చలు వరకూ వెళ్ళానన్నారు. వైఎస్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చటం సోనియాకు తెలియక చేసిన పొరపాటే కానీ.. తెలిసి చేసిన తప్పు కాదని షర్మిల పేర్కొన్నారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జనసేనాని పవన్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న తరుణంలో అభిమానులంతా పలు విధాలుగా అభిమానాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో అన్న దానం, రక్త దానం, అనారోగ్యంతో ఉన్న వారికి పండ్లు పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టారు.
కృష్ణా జిల్లా గుడివాడలో దారుణ ఘటన జరిగింది. స్థానిక ఎస్పీఎస్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాఠశాలలో చదివే విద్యార్థులతో ఆమె మూత్రశాలలు కడిగించిన ఘటన హాట్ టాపిక్ గా మారింది. అలానే వంట సిబ్బంది రాని సమయంలో కూడా వండిన పాత్రలను పిల్లలే తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు పవన్ పుట్టిన రోజును పురస్కరించుకొని అటు థియేటర్లలో గుడుంబా శంకర్ సినిమా 4కె వెర్షన్ రీరిలీజ్ కాగా.. ఇటు కొత్త సినిమాల అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులను ఫిదా చేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఆదాయ పన్నుల శాఖ (ఐటీ) నోటీసులు జారీ చేసింది. టీడీపీ హయాంలో సబ్ కాంట్రాక్ట్‌ల ద్వారా చంద్రబాబుకు ముడుపులు అందాయనే అభియోగాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. టీడీపీ హయాంలో అంటే 2016 నుంచి 2019 మధ్య కాలంలో ఇన్ ఫ్రా
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ఆయనను అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది. ఆయనను అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు తరలిస్తున్నారని సమాచారం అందుతుంది. ఈ ఉదయం ఎయిర్ ఏషియా విమానంలో