Home / ప్రాంతీయం
జగిత్యాల జిల్లా కోరుట్లలో తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మరణించిన బంకి దీప్తి కేసులో పోలీసులు దర్యాప్తుని ముమ్మరం చేశారు. సిసి కెమెరాలు, సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు బృందాలు ముందుకు సాగుతున్నాయి.
చిత్తూరు జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించింది. జిల్లాలోని గుడిపాల మండలం 190 రామాపురం హరిజనవాడలో ఏనుగు దంపతులను తొక్కి చంపిన ఘటన చోటు చేసుకుంది. కాగా ఈ ఏనుగు దాడిలో మృతి చెందిన వారిని వెంకటేష్, సెల్విగా గుర్తించారు. ప్రస్తుతం ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
ఏపీ, తెలంగాణలో పొత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అవసరాన్ని బట్టి పొత్తులు ఉంటాయన్న చంద్రబాబు, తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పారు. తెలంగాణలో బీజేపీతో పొత్తులపై చర్చలకు సమయం మించిపోయిందని చంద్రబాబు అన్నారు.
ఏపీ సీఎం జగన్ పై జరిగిన కోడికత్తి దాడి కేసు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిందే. కొద్ది రోజుల క్రితం కేంద్ర హోంశాఖ.. ఎన్ఐఏ కోర్టును విశాఖలో కొత్తగా ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులిచ్చింది. దీంతో కేసు పరిధి విశాఖకు మారింది. ‘కోడి కత్తి’ కేసు విచారణ విశాఖలో ప్రారంభమైంది. నగరం లోని మూడో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన ప్రాణం ఉన్నంత వరకు తాను బీజేపీలోనే ఉంటానన్నారు. ఒకవేళ బీజేపీ తనపై సస్పెన్షన్ ఎత్తివేయకపోతే తాను కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటానన్నారు. తాను హిందువాదినని రాజాసింగ్ తెలిపారు.
గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరులో ఆటో డ్రైవర్ భార్య రావూరి షీలా డాక్టరేట్ పట్టా పొందారు. ఎంతో పట్టుదలతో సాగిన ఆమె ప్రయాణం ఆమె పలువురికి స్పూర్తిదాయకం. ఆమె పట్టుదలకు భర్త సహకారంతోడయి డాక్టరేట్ పట్టా తీసుకునేలా చేసింది.
ఏపీ మంత్రి రోజా భర్త సెల్వమణి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగుతోపాటు తమిళంలోనూ పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్, ఫెఫ్సీ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే తాజాగా సెల్వమణిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ
ఖమ్మం జిల్లా నాయకన్ గూడెం వద్ద జరిగిన టీచర్ బైరోజు వెంకటాచారి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 15 లక్షలు సుపారీ ఇచ్చి కిరాయి హంతకులతో చంపించారని పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని హతుడు వెంకటాచారి స్నేహితుడు గిరిధర్ రెడ్డిగా నిర్థారించారు.
ఆంధ్రప్రదేశ్ లో దొంగ ఓట్ల పంచాయితీ ఢిల్లీకి చేరింది. సీఈసీతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఏపీ ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఓట్లు తొలగించారని ఆరోపించారు. టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని కంప్లైంట్ చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్ నేడు నగరి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా విద్యా దీవెన నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. పేదల పిల్లలు చదువుల కోసం ఇబ్బంది పడకూడదనే విద్యా దీవెన పథకం తీసుకొచ్చామన్నారు.