Home / ప్రాంతీయం
మాదాపూర్‌లో వెలుగులోకి వచ్చిన టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో ముగ్గురు నిందితులని పోలీసులు అరెస్ట్ చేశారు. సినీ ఫైనాన్షియర్ వెంకట రత్నారెడ్డి, బాలాజీ, మురళిని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. వీరినుంచి 33 లక్షల రూపాయల విలువైన మాదకద్రవ్యాలు, 72వేల ఐదు వందల రూపాయలు, రెండు కార్లు, ఐదు ఫోన్లని సీజ్ చేశారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకుంది. జనవరి 27న కుప్పంలో ప్రారంభమైన లోకేశ్ పాదయాత్ర ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాకు చేరింది. లోకేష్ చేపట్టిన ఈ పాదయాత్రలో 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్లు లోకేష్ నడవనున్నారు. అయితే నేటితో
హైదరాబాద్ నగరం నడిబొడ్డున మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతుంది. ఈ వ్యవహారంలో మల్లవ టాలీవుడ్ కి లింకు లు ఉండడం ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మాదాపూర్ లోని విఠల్ రావ్ నగర్ ఫ్రెష్ లివింగ్ అపార్ట్ మెంట్ లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసారు.
శ్రీశైలంలో అగ్నిప్రమాదం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 15 దుకాణాలు దగ్ధం అయ్యాయి. ఆలయ సమీపంలో ఉన్న ఎల్ బ్లాక్ కాంప్లెక్స్ లోని లలితాంబికా దుకాణంలో బుధవారం అర్ధరాత్రి దాటక మంటలు మొదలయ్యాయి. మంటలు చెలరేగి వ్యాపించడంతో భారీ నష్టం జరిగినట్లు చెబుతున్నారు.
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల గురువారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశం అయ్యారు ఈ భేటీ కోసం నిన్ననే.. భర్త అనిల్ తో కలిసి.. షర్మిల హస్తిన బయలుదేరి వెళ్లారు. అయితే వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారా..? లేక పార్టీతో పొత్తు పెట్టుకుంటారా అనేది ఆసక్తిగా మారింది.
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని 470 కేజీల వెండితో చిత్ర రూపం తీర్చిదిద్ది మెమరబుల్ గిఫ్ట్ ఇచ్చారు. నెల్లూరు నగర పార్టీ అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో ఈ కళాకృతిని తయారు చేయించారని తెలుస్తుంది. కాగా ఇందుకు సంబంధించిన మేకింగ్ వీడియోను
హైదరాబాద్‌లోని మాదాపూర్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్లో రేవ్‌పార్టీని నార్కోటిక్స్ బ్యూరో అధికారులు భగ్నం చేశారు. రేవ్ పార్టీని నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రేవ్ పార్టీలో పాల్గొన్న వారి నుంచి భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు
బీజేపీతో పొత్తుకు టీడీపీ తహతహలాడుతోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పూర్తిగా నమ్మకం కోల్పోయిన టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లే ఆలోచన..చంద్రబాబు ఎప్పుడూ చేయలేదని పొత్తు లేని చరిత్ర చంద్రబాబుకు లేదన్నారు.
తెలంగాణలో ఉపాధ్యాయులకి హైకోర్టు శుభవార్త చెప్పింది. ఉపాధ్యాయుల బదిలీలకి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తుది తీర్పులకు లోబడి బదిలీలు ఉండాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. టీచర్ల బదిలీలపై గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులని హైకోర్టు సవరించింది.
ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు ఊహించని షాక్ తగిలింది. టీటీడీ గతంలో అతిథి గృహం నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఆ స్థలాన్ని కాటేజ్ డొనేషన్ పథకం కింద కొత్త దాతకు కేటాయించాలని యోచిస్తోందని తెలుస్తుంది. వెంకట విజయం అతిథి గృహం పునర్నిర్మాణం లేదా పునర్నిర్మాణం