Home / ప్రాంతీయం
ఏపీలో ప్రస్తుత పరిస్థితులపై తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవచ్చని అన్నారు.వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సందర్బంగా దయాకర్ ఏపీలో విద్యుత్ పరిస్థితిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఏపీలోని అన్నమయ్య జిల్లా పీలేరులో జరిగిన ఆటో డ్రైవర్ సుధాకర్ హత్య కేసులో సంచలన నిజాలు ఆలస్యంగా బయటికి వచ్చాయి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఆమె భర్తపై సైనేడ్ ఇంజెక్షన్ లతో దాడి చేసి హత్యమార్చాడు ఓ మాజీ వాలంటీర్. ఆ కిరాతకుడికి మరో ముగ్గురు స్నేహితులు సహకరించడంతో ఈ దారుణానికి ఒడిగట్టారు.
తిరుమల అలిపిరి నడకమార్గంలో అటవీశాఖ అధికారులు తాజాగా ఐదో చిరుతను పట్టుకున్నారు. నరసింహస్వామి ఆలయం, ఏడవ మైలు రాయి మధ్యలో చిరుత చిక్కినట్లు సమాచారం అందుతుంది. నాలుగు రోజుల క్రితమే చిరుత కోసం బోన్లు ఏర్పాటు చేశారు. దీంతో ఆపరేషన్ చిరుత విజయవంతం అయినట్టు అధికారులు చెబుతున్నారు.
భువనగిరి ఎంపి, మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటి రెడ్డి వెంకటరెడ్డి మరోసారి అలిగారు. ఇటీవల ప్రకటించిన పార్టీ కమిటీల్లో తనకి స్థానం దక్కలేదని కోమటిరెడ్డి మనస్థాపానికి గురయ్యారు. మూడు రోజులుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కసరత్తు చేస్తున్నా ఆ వైపు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కన్నెత్తి కూడా చూడలేదు.
అగ్రిగోల్డ్ కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛార్జిషీట్ దాఖలు చేసింది. అగ్రిగోల్డ్ ప్రమోటర్లు ఏవీ రామారావు, శేషునారాయణరావు, హేమసుందర్ అనే వ్యక్తులపై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. వారితోపాటు అగ్రిగోల్డ్ ఫామ్ ఎస్టేట్స్ సహా 11 అనుబంధ కంపెనీలపై ఛార్జిషీట్ వేసింది.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం బేతపూడి వద్ద తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర క్యాంప్ సైట్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళ దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పలువురు తెదేపా నేతలు, కార్యకర్తలతో పాటు పోలీసులకు కూడా గాయాలయ్యాయి.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లో బాహుబాలి సిన్ రిపీట్ అయింది. బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ చిన్నారిని చేతితో పట్టుకుని వాగు దాటే సీన్ అందరికీ గుర్తుంటుంది. అదే రకంగా ఆసిఫాబాద్ జిల్లాలో ఒక తండ్రి తన కూతురికి వైద్యం చేయించేందుకు రవాణా సౌకర్యం లేకపోవడంతో చేతితోనే పట్టుకుని వాగు దాటాడు.
గురువుల కన్నా గూగుల్ మిన్న అనే విధంగా వైసీపీ మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో విద్యాశాఖ మంత్రిగా పని చేసి.. గురువులను కించపరిచేలా మంత్రి ఈ విధంగా మాట్లాడడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదిమూలపు సురేష్ క్షమాపణ చెప్పాలంటూ
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులని ఖరారు చేసేందుకు హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణా హోటల్లో స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన సమావేశం జరుగుతోంది.
16 సంవత్సరాల తరువాత ఇబ్రహీంపట్నం బిఫార్మసీ విద్యార్థిని ఆయేషామీరా హత్య కేసు మళ్ళీ మొదటికి వచ్చింది. ఈ కేసులో పోలీసులకి రిపోర్టు ఇచ్చిన పూసపాటి వెంకట కృష్ణప్రసాద్‌ని విచారణకి హాజరు కావాలని సీబీఐ అధికారులు నోటీసులిచ్చారు.