Home / ప్రాంతీయం
హైదరాబాద్ లో మంగళవారం ఉదయం నుండి కురిసిన వర్షానికి శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ధరణి నగర్లో ఇండ్లలోకి వర్షం నీరు చేరింది. దీనితో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షాల కారణంగా తాజాగా ప్రగతి నగర్లోని ఎన్ఆర్ఐ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. నాలుగేళ్ల బాలుడు ఇంటి వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ నాలాలో పడి మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపుతుంది. ప్రస్తుతం బాలుడి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఏపీలో బాంబు బెదిరింపు కాల్స్ కలకలం సృష్టించాయి. గన్నవరం విమానాశ్రయంలో బాంబు పెట్టినట్లు బెదిరింపు కాల్ రావడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు పోలీసులతో పాటు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ కు సమాచారం అందించారు. ప్రయాణికులను బయటకు పంపించి
గురుపూజోత్సవం సందర్బంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు.జన్మనిచ్చిన అమ్మానాన్నల తరవాత మనకు అంతటి ఆప్యాయత, వాత్సల్యం లభించేది గురు దేవుళ్ళ దగ్గరే నని పవన్ అన్నారు.
తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా భాగ్య నగరంలో గ్యాప్ లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నేడు హైదరాబాద్ సహా పలు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ తో
ద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా డీకే అరుణని గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు డీకే అరుణని ఎమ్మెల్యేగా గుర్తిస్తూ గెజిట్ జారీ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలో ఘనంగా సీతారామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు జరిగాయి. చినజీయర్ స్వామి చేతుల మీదుగా గుడిలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది.
గత కొద్ది రోజులుగా ఎండ, ఉక్కపోతతో సతమతమవుతున్న తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో.. రాష్ట్రంలో మరో మూడు రోజులు ఉత్తర, దక్షిణ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్దులకు టికెట్ల ఖరారు ప్రక్రియ తుది దశకి చేరుకుంటోంది. ఈ సందర్బంగా తమకి లేకపోయినా ఫర్వాలేదు ప్రత్యర్థులకి మాత్రం టికెట్ దక్కకూడదంటూ కాంగ్రెస్ నేతలు ఎత్తులు వేయడం ప్రారంభించారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో వంగవీటి మోహన రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ నర్సాపురం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జక్కం అమ్మానీ బాబ్జి దంపతుల ద్వితీయ కుమార్తె పుష్పవల్లి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.