Home / ప్రాంతీయం
: కాకినాడ జిల్లా తాళ్ళరేవు లంక వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగిన ఏడుగురు యువకుల్లో నలుగురు యువకులు గల్లంతయ్యారు. మిగిలిన ముగ్గురు యువకులు క్షేమంగా ఒడ్డుకి చేరుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు గ్రామం నుండి యానాం ప్రాంతానికి ఈ ఏడుగురు యువకులు విహార యాత్రకి వచ్చారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. మీడియా ప్రతినిధులతో, ప్రతిపక్షాల తో ఎలా వ్యవహరించాలి, బహిరంగ సభలలో ఎలా మాట్లాడాలి అన్నఅంశాలపై ఈ సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేశారు.
Motkupalli Narsinhulu: మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు శనివారం పురుగుల మందు డబ్బాతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద హైడ్రామా సృష్టించారు. కేసీఆర్‌ను సమర్థించి తప్పుచేశానని ఆవేదన చెందారు. దళితబంధు అమలు కాకుంటే చస్తానని హెచ్చరించారు. యాదగిరిగుట్ట దగ్గర చెప్పిన మాటను నిలబెట్టుకుంటానని అన్నారు. చంద్రబాబును చంపాలని చూస్తున్నారు..(Motkupalli Narsinhulu) ఈ సందర్బంగా మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ మూడు పార్టీలు(వైఎస్ఆర్ సిపి, బిజెపి, బిఆర్ఎస్) కలిసి కుట్ర చేసి చంద్రబాబును చంపాలని చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబును హింసించి బాధపెడుతున్నారని […]
తెలంగాణలోని గోషామహల్ ఎమ్మేల్యే రాజా సింగ్ పై విధించిన సస్పెన్షన్ వేటును ఎత్తి వేయనున్నారు. ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకోనుంది. రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేయనున్నట్లు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
ప్రజల కోసం టీడీపీ నేతలు నిత్యం పోరాడుతున్నారని నారా లోకేష్ అన్నారు. శనివారం తెలుగుదేశం పార్టీ విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురై కంట తడిపెట్టారు. ఐదేళ్లుగా టీడీపీ నేతలపై దొంగ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రజెక్టులను సందర్శించడమే చంద్రబాబు చేసిన నేరమా అని ప్రశ్నించారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ మరోసారి మండిపడ్డారు. అంగళ్లులో పోలీసులపై దాడులు చేయించారని ఫైర్ అయ్యారు. పుంగనూరులో 40 మంది పోలీసులకు గాయాలయ్యేలా చేశారని.. ఓ కానిస్టేబుల్‌కి కన్ను కూడా పోయిందని నిప్పులు చెరిగారు.
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెల 15 నుంచి రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేబట్టబోతుందనే విషయంపై కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు హరిరామజోగయ్య సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి వేణుగోపాల కృష్ణ ఈ ప్రకటన చేయడం పట్ల కాపు సంక్షేమ సేన స్వాగతించిందని జోగయ్య తెలిపారు.
దసరా పండుగను పురస్కరించుకొని.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు ఏపీ సీఎం వైఎస్ జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆలయానికి చేరుకున్న సీఎం జగన్.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమలను సమర్పించారు. అనంతరం ఆలయంలో సీఎం జగన్ ప్రత్యేక
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నేడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించిన ఆయన.. సమావేశంలో మాట్లాడుతూ .. రాష్ట్రానికి బలమైన దిశా నిర్దేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టే తెలుగుదేశంతో కలిశాం అని ఆయన అన్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో ఏ మాత్రం నిర్లక్ష్యంతో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
ఫైబర్‌నెట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు ఊరట లభించింది. ఈరోజు సీఐడీ వేసిన పీటీ వారెంట్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. సీఐడీ తరఫు న్యాయవాదులు కోర్టులో ఈ మేరకు మెమో దాఖలు చేశారు. చంద్రబాబుపై నమోదు చేసిన మూడు ఎఫ్ఐఆర్లకు స్కిల్ డెవలెప్మెంట్ కేసులో దాఖలు