Home / ప్రాంతీయం
తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నాయకులు మాటల యుద్దానికి దిగుతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టోలోని ఓ అంశం పట్ల బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య మాటల యుద్దం జరుగుతుంది. తెలంగాణలో రైతు కుటుంబాలకు
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసే అవకాశాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో టీబీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, బి.జె.పి. ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డా. కె.లక్ష్మణ్ చర్చలు జరిపారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.
ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాలు విసిరారు. దమ్ముంటే గోషా మహల్ లో ఎం.ఐ.ఎం అభ్యర్థిని నిలబెట్టాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థికి లబ్ధిచేకూర్చేందుకు ఎం.ఐ.ఎం అభ్యర్థిని గోషామహల్ నుంచి నిలబెట్టడం లేదని రాజాసింగ్ ఆరోపించారు.
ఏపీలో కొంతమంది వాలంటీర్ల ఘాతుకాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఏపీలో వాలంటీర్ల నేరాలు, డేటా సేకరణ వంటి అంశాలపై జనసేన అధినేత ప్రశ్నించడంతో ఈ విషయాలు హాట్ టాపిక్ గా మారాయి. అదే క్రమంలో బంగారం కోసం ఓ వాలంటీర్ మహిళను దారుణంగా హతమార్చిన ఘటన,
తెలంగాణ శాసన సభ ఎన్నికలలో జనసేన పోటీ చేయవలసిందేనని జనసేన తెలంగాణ నాయకులు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని జనసేన తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యాలయంలో మంగళవారం రాత్రి జనసేన నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.
ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ సుదీర్ఘంగా చర్చించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఏపీకి సంబంధించిన పలు అంశాలపై సమీక్షించి చర్చించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగం కాంగ్రెస్ బస్సు యాత్ర రేపటినుంచి ప్రారంభం కానుంది. ఏఐసిసి అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బస్సు యాత్రని లాంఛనంగా ప్రారంభిస్తారు.రేపు సాయంత్రం 4 గంటలకు రామప్ప దేవాలయాన్ని రాహుల్, ప్రియాంక దర్శించుకుంటారు. ఆరు గ్యారంటీలను శివుడి ముందు పెట్టి పూజలు చేస్తారు
తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.. స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ పిటిషన్ పై పలుమార్లు వాదనలు వినిపించారు. పలుమార్లు వాయిదా కూడా పడింది. తాజాగా ఈరోజు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదితో కూడిన
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెదేపా చీఫ్ చంద్రబాబుకు మళ్ళీ చుక్కెదురైంది. కాగా ఏసీబీ కోర్టులో.. చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేయడంతో ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే పలుమార్లు ఈ విచారణ వాయిదా పడగా.. తాజాగా ఈ పిటిషన్ పై మంగళవారం ఉదయం హైకోర్టు విచారణ చేపట్టింది.
మార్గదర్శి చిట్ ఫండ్ ఛైర్మన్ రామోజీరావుపై ఏపీ సీఐడీకి మరో ఫిర్యాదు అందింది. మార్గదర్శిలో తనకు రావాల్సిన షేర్లు ఇవ్వకుండా తుపాకీతో బెదిరించారని మార్గదర్శిలో పెట్టుబడి పెట్టిన జి.జగన్నాథరెడ్డి కుమారుడు యూరిరెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు.