Home / ప్రాంతీయం
నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయంలో మరో వివాదం చోటు చేసుకుంది. సరస్వతి దేవి అభిషేకం లడ్డూలకు ఫంగస్ సోకింది. ఫలితంగా వేల సంఖ్యలో లడ్డూలు పాడయ్యాయి. ఒక్కో అభిషేకం లడ్డూ ధర 100 రూపాయలుగా ఉంది. జరిగిన దాన్ని గమనించిన అధికారులు గుట్టు చప్పుడు కాకుండా పాడైన లడ్డూలని మాయం చేసేందుకు ప్రయత్నించారు.
రాజమండ్రిలో జనసేన - టీడీపీ సమన్వయ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశానికి జనసేనాని పవన్ కళ్యాణ్, టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధ్యక్షతన కమిటీ తొలి సమావేశం జరిగింది. కామన్ మినిమమ్ ప్రోగ్రాం సహా ఆరు అంశాలతో అజెండా ఖరారు చేశారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడితో రాజమండ్రి జైల్లో ములాఖత్ సందర్బంగా పలు కీలక అంశాలని పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రస్తావించారు. కాసేపట్లో జరగబోయే జనసేన- టిడిపి జాయింట్ యాక్షన్ కమిటీ తొలి సమావేశంలో చర్చించబోయే అంశాలని చంద్రబాబుకి లోకేష్ వివరించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశం చేస్తోంది రావణాసుర దహనం.., మనం చేద్దాం జగనాసుర దహనం చేద్దామని నారా లోకేష్ పిలుపునిచ్చారు. అరాచక, విధ్వంసక పాలన సాగిస్తున్న సైకో జగనాసురుడి పీడ పోవాలని తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే, దివంగత వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ ఓ ఇంటి వాడయ్యారు. ఆదివారం రాత్రి నరసాపురానికి చెందిన జక్కం పుష్పవల్లిని వివాహం చేసుకున్నారు.విజయవాడ పోరంకిలోని మురళీ రిసార్ట్స్‌లో జరిగిన ఈ వివాహానికి పలువురు రాజకీయ ప్రముఖులు, అభిమానులు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు.
రాజమండ్రిలో రేపు జనసేన టీడీపీసమన్వయ కమిటీ సమావేశం జరుగనుంది. తొలి సమావేశ వేదిక మంజీరా హోటల్లో ఏర్పాట్లను ఉమ్మడి తూ.గో. జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్, టీడీపి నేత ఆదిరెడ్డి వాసు , జనసేన రాజమండ్రి ఇంఛార్జి అత్తి సత్యనారాయణ పరిశీలించారు. ఈరోజు సాయంత్రానికి రాజమండ్రి టీడీపీ క్యాంపు కార్యాలయానికి నారా లోకేష్ చేరుకోనున్నారు.
వ్యవస్థలను మేనేజ్ చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు మించిన నాయకుడు భారత దేశంలో లేరని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. గుంటూరులో విలేఖరులతో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. కేంద్రంలో తాము చక్రాలు తిప్పలేదని, రాష్ట్రపతిని నియమించలేదని అన్నారు.
తాను జైలులో లేనని., ప్రజల హృదయాల్లో ఉన్నానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలు నుంచి ప్రజలకు లేఖ రాశారు. విధ్వంస పాలనను అంతం చేయాలనే సంకల్పంలో ఉన్నానని తెలిపారు. నలభై ఏళ్ల రాజకీయ జీవితం గురించి జైలు గోడల మధ్య ఆలోచించానని అన్నారు.
తెలంగాణ బీజేపీ నేతలు ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారు. దాదాపు 52 మందితో తొలి జాబితాను అధిష్టానం విడుదల చేసింది. బీజేపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీకి నిలబెట్టింది. ఇక అంతా ఊహించినట్టే.. ఈటల రాజేంద్ర.. సీఎం కేసీఆర్ పై గజ్వేల్ నుంచి పోటీ చేయనున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కింద భూపాలపల్లి జిల్లాలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ అత్యంత ప్రమాదకర స్థితికి చేరింది. 20వ పిల్లర్ డ్యామేజి అయినట్లుగా అధికార యంత్రాంగం గుర్తించింది. దీంతో గంట గంటకీ 6వ బ్లాక్ కుంగిపోతోంది. 19, 20వ పిల్లర్ల సబ్ స్ట్రక్చర్ రెండుగా చీలిపోయింది.