Home / ప్రాంతీయం
ఏపీలో మళ్లీ అధికారమే లక్ష్యంగా వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. నేతల వరుస పర్యటనలు, యాత్రలతో నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది వైసీపీ. అందులో భాగంగానే అక్టోబర్ 26 నుంచి బస్సుయాత్ర చేపట్టాలని సీఎం జగన్ నిర్ణయించారు.
మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసారు. ఈ మేరకు ఆయన పార్టీకి తన రాజీనామా లేఖను పంపించారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ప్రకటించారు. కొద్దినెలల కిందట కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరి మునుగోడు ఉప ఎన్నికలో పోటీచేసి ఆయన ఓడిపోయిన విషయం తెలిసిందే.
తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి.. ‘నిజం గెలవాలి’ యాత్రను ప్రారంభించారు. ఈ మేరకు ముందుగా నారావారిపల్లెలో ఆమె తండ్రి, తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి ఆమె పూలమాల వేసి యాత్రను ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు అరెస్ట్‌తో ఆవేదన చెంది మరణించిన తెదేపా కార్యకర్తలు, అభిమానుల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శిస్తున్నారు.
విజయదశమిని పురస్కరించుకొని కర్నూలు జిల్లా దేవరగట్టులో బన్నీ ఉత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఉత్సవంలో భాగంగా ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవటం కోసం 3 గ్రామాల ప్రజలు ఓ వర్గంగా, ఐదు గ్రామాల ప్రజలు మరో వర్గంగా ఏర్పడి కర్రలతో తలపడ్డాయి. అయితే ఈ ఉత్సవంలో అనుకోని
దసరా సందర్భంగా.. కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగట్టు లో జరిగే కర్రల సమరం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. దేవరగట్టు గ్రామం వద్ద కొండపై మాళమ్మ, మల్లేశ్వరస్వామి ఆలయం ఉంది. ఈ గుడిలో దసరా పర్వదినాన.. అర్ధరాత్రి 12 గంటలకు కల్యాణం జరిపిస్తారు. అనంతరం కొండ పరిసర ప్రాంతాల్లో ఉన్న
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. దొంగతనం చేశారనే అనుమానంతో.. గిరిజన యువతిపై పైశాచికంగా దాడి చేసి ఆ తర్వాత పోలీసుల చేత కొట్టించడం.. రెండు రోజులుగా బందీలుగా చేసి ఇబ్బంది పెట్టిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Murder Case : ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. మండలంలోని జంగమేశ్వర గ్రామంలో కూనిరెడ్డి కృష్ణారెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు పులిపాడు గ్రామంలో ప్రభుత్వ వైన్ షాపు సూపర్వైజర్ గా పని చేస్తున్నాడు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొనకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కృష్ణారెడ్డిని చంపిన హంతకులను పట్టుకోవడం కోసం మూడు స్పెషల్ టీంలను పోలీసులు రంగంలోకి దింపినట్టు సమాచారం. కృష్ణారెడ్డి మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచారు. […]
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం సాయంత్రమే తిరుమలకు చేరుకున్న ఆమె ఈరోజు వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ అధికారులు భువనేశ్వరికి స్వాగతం పలకగా.. దర్శనం అనంతరం వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
వరంగల్ లో విషాదకర ఘటన జరిగింది. దసరా పండగను పురస్కారించుకొని స్వగ్రామానికి వెళ్తున్న ఓ కుటుంబంపై విధి కన్నెర్ర జేసింది. ఊహించని ఈ ఘటనలో ఓ యువతి, ఆమె తండ్రి మరణించగా.. ఆమె భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా కిష్టాపురం
ఆంధప్రదేశ్ కు పట్టిన వైసీపీ తెగులుకు జనసేన- టీడీపీ వ్యాక్సినే సరైనదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సోమవారం రాజమండ్రిలో జనసేన- టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ అస్దిరతకు గురైన ఏపీలో సుస్దిరత తేవాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.