Home / ప్రాంతీయం
నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. విభజన చట్టం ప్రకారం తమకు రావాల్సిన వాటా నీటినే తీసుకున్నామని వివరించారు. తమవి కాని ఒక్క నీటి బొట్టునైనా తీసుకునే ప్రసక్తే లేదన్నారు. సాగర్ లో 13వ గేట్ వరకూ ఏపీకి చెందిన భూభాగమని.. మా ప్రాంతాన్ని మేము తీసుకున్నామని తెలిపారు.
నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. డ్యాంపై ఇరు రాష్ట్రాల పోలీస్ బలగాలు మోహరించాయి. డ్యామ్ 13వ గేటు వద్ద ఏపీ పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించేందుకు తెలంగాణ పోలీసులు జేసిబిలను సిద్దం చేశారు. ఇరు రాష్ట్రాల పోలీస్ బలగాలు మోహరింపుతో డ్యామ్ పై ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
తెలంగాణలో 119 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం సాయంత్రం 7 గంటల వరకు 64.14 శాతం పోలింగ్ నమోదైనట్లు భారత ఎన్నికల సంఘం వెల్లడించింది.అత్యధికంగా జనగాంలో 83.34 శాతం, నర్సంపేటలో 83 శాతం, నక్రేకల్లో 82.34 శాతం, భోంగిర్లో 81 శాతం, పాలకుర్తిలో 81 శాతం, జహీరాబాద్లో 79.8 శాతం, నర్సాపూర్ (78.89 శాతం), డోర్నకల్ (79.32 శాతం), వైరా (79.20 శాతం) పోలింగ్ నమోదయింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ నేపధ్యంలో ఇక్కడ ఫలితాలపై పలు సంస్దలు ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేసాయి.అయితే మెజారిటీ సర్వేలు కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని అంచనాలు వెలువరించాయి. వివిధ సంస్దలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఈ విధంగా ఉన్నాయి.
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సాగర్ రైట్ కెనాల్ కు నీటిని విడుదల చేయడం కోసం ఏపీ పోలీసులు రావడంతో వివాదం చెలరేగింది. దాంతో ప్రాజెక్ట్ వద్ద విద్యుత్ సరాఫరాను అధికారులు నిలిపివేశారు. ఇక ఏపీ పోలీసులు డ్యామ్ గేట్లు ధ్వంసం చేసి ఎస్పీఎఫ్ పోలీసులపై దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ప్రాజెక్టు సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. 119 నియోజకవర్గాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసును సీబీఐకి ఇవ్వాలన్న మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్పై విచారణ డిసెంబర్ 13కి వాయిదా పడింది. ఈ కేసులో కొంతమందికి నోటీసులు అందలేదని పిటిషనర్ తరపు లాయర్లు హైకోర్టు దృష్టికి తెచ్చారు.
ఏపీలో క్లీనింగ్ యంత్రాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీసు వద్ద పచ్చ జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. జాతీయ సఫాయి కర్మచారిస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్కెఎఫ్డిసి) సహకారంతో స్వచ్ఛత ఉద్యమి యోజన (ఎస్యువై) కింద స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎంపిక చేసిన 100 మంది పారిశుద్ధ్య కార్మికులకు (సఫాయి కర్మచారిలు) ముఖ్యమంత్రి లాంఛనంగా వాహనాలను అందజేశారు.
తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ దీక్షా దివస్ కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్ రక్తదానం చేశారు. కేసీఆర్ ఆమరణ దీక్షకు నేటికి 15 ఏళ్లు అయిన సందర్బంగా నాటి చైతన్యాన్ని గుర్తు తెచ్చుకుందామని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ సచ్చుడో , తెలంగాణ వచ్చుడో అని నినదించిన నేత కేసీఆర్ అని అన్నారు.
మీరు గెలిపించకపోతే డిసెంబర్ 4న నా శవయాత్రకి రావాలంటూ హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం(ఈసీ) సీరియస్ అయింది. తక్షణమే ఈ వ్యాఖ్యలపై స్థానిక రిటర్నింగ్ అధికారికి వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. నియోజకవర్గంలో జరిగిన ప్రచార సభలో కౌశిక్ రెడ్డి తనకి ఓటేయాలంటూ అడిగిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు.