Home / ప్రాంతీయం
ఏపీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అస్వస్థతకు గురయ్యారు. దాంతో వెంటనే ఆయనను తాడేపల్లిలోని మణిపాల్ హాస్పిటల్ లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మధ్యాహ్నం స్వల్ప అస్వస్థతకు గురైన మంత్రి వాంతులు చేసుకున్నారు. ఇక వైద్యులు గుండె సంబంధిత పరీక్షలతో పాటు పూర్తి హెల్త్ చెకప్ చేయాలని సూచించారు. రేపు ఉదయం మంత్రి వేణుకి డాక్టర్లు వైద్య పరీక్షలు చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. 16 సబ్స్టేషన్లకు శంకుస్థాపన, 12 సబ్స్టేషన్ల వర్చువల్ విధానంలో ప్రారంభోత్సవం చేశారు. దాదాపు రూ.3099 కోట్లు సబ్స్టేషన్ల కోసం ఖర్చుచేస్తున్నామని సీఎం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోదావరి ముంపు ప్రాంతాల్లో చింతూరు, వీఆర్‌పురం,
తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసిందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ స్పష్టం చేశారు. సాయంత్రం 5గంటలకు ప్రచారం ముగిసిన వెంటనే ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ ప్రకటనలు ఇవ్వకూడదని వికాస్ రాజ్ రాజకీయనాయకులకు సూచించారు.
తెదేపా అధినేత చంద్రబాబు బెయిల్ రద్దుపై ఏపీ సీఐడి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను.. సుప్రీం కోర్టు డిసెంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సుప్రీంకోర్టులో ఏపీ సీఐడీ సవాల్ చేసింది. అలానే తాజాగా ఈ కేసుకు సంబంధించి మాట్లాడవద్దని
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. కూకట్ పల్లి నియోజకవర్గ బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి ప్రేమ్ కుమార్‌కు మద్దతుగా ప్రచారంలో భాగంగా బాలానగర్ నుంచి హస్మత్ పేట అంబేద్కర్ విగ్రహం వరకు పవన్ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన
కాంగ్రెస్ పార్టీ జాతీయ గౌరవ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు సందేశం పంపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ ఆ వీడియోఇ షేర్ చేసింది. ఆ మెసేజ్ లో సోనియా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ప్రేమ, అభిమానాలకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. మార్పు కావాలంటే
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలన్న సిఐడి పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. గతవారం ఏపీ సిఐడి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం వాదనలు విననుంది
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం ప్రస్తుతం రాష్ట్ర స్థూల వార్షిక ఉత్పత్తి చంద్రబాబు హయాంలో కంటే 13.2 లక్షల కోట్లకు పెరిగిందని ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో 15వ స్థానంలో ఉన్న రాష్ట్రం దేశంలోనే పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే 5వ స్థానంలో ఉందన్నారు. ఇవన్నీ పచ్చ కళ్లద్దాల వల్ల పురంధేశ్వరికి కనిపించడంలేదని మండిపడ్డారు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈ క్రమంలోనే అన్ని పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అందులో భాగంగానే పలు రాజకీయ పార్టీల అగ్ర నేతలు ఇవాళ అధిక ప్రాంతాల్లో పర్యటన చేయనున్నారు. ఇక మరోవైపు సాయంత్రం ఐదు గంటల నుంచి రోడ్డులన్నీ నిర్మానుష్యం కానున్నాయి. 13 జిల్లాలో సాయంత్రం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ హైదరాబాద్ లో రోడ్ షో నిర్వహించారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ నుంచి కాచిగూడ వరకు 2 కిలోమీటర్ల మేర ప్రధాని రోడ్‌షో సాగింది. ప్రజలకు, పార్టీ నేతలు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ ప్రధాని ముందుకు సాగారు. ప్రధాని మోదీపై అభిమానులు, కార్యకర్తలు పూల వర్షం కురిపించారు.