Home / ప్రాంతీయం
: తెలంగాణలో ఐపిఎస్‌ల బదిలీలు మొదలయ్యాయి. రాచకొండ పోలీస్ కమిషనర్‌గా సుధీర్ బాబుని నియమించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా కొత్తకోట శ్రీనివాస రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సైబరాబాద్ కమిషనర్‌గా అవినాష్ మహంతిని నియమించారు.
టిఎస్పిఎస్సి చైర్మన్ జనార్ధన్ రెడ్డి రాజీనామాను తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆమోదించలేదు. పేపర్ లీకేజీకి బాధ్యులు ఎవరో తేల్చకుండా రాజీనామా ఆమోదించకూడదని గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా జనార్దన్‌రెడ్డిని 2021లో అప్పటి కెసిఆర్ ప్రభుత్వం నియమించింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన సూచనల మేరకు సోమవారం 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను మార్చినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.కొత్తగా నియమితులైన ఇన్ఛార్జ్లు మంగళవారం నుంచి పార్టీ కార్యకలాపాలు చూసుకుంటారని తెలిపారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు కేసీఆర్ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యులను, వైద్యులను అడిగి అన్ని విషయాలను తెలుసుకున్నారు.
విశాఖ పట్నంలోని నొవాటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎంపీ సత్యనారాయణ ఎంవీబీ వెంచర్ సంబంధించిన రోడ్డును బ్లాక్ చేశారని.. నిరసన వ్యక్తం చేసేందుకు బయలుదేరిన జనసేన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో పాటు, జనసేన కార్యకర్తలు, వీరమహిళలను పోలీసులు అడ్డుకున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి (ఆర్కే) పార్టీకి తన పదవికి రాజీనామా చేశారు. స్సీకరి్ తమ్మినేని సీతారాంకి తన రాజీనామా లేఖని పంపించారు. కొంతకాలంగా పార్టీ అధిష్టానం పట్ల ఆళ్ళ రామకృష్ణారెడ్డి అసంతృప్తితో ఉన్నారు. దీనితో స్పీకర్ ఫార్మాట్లొ రాజీనామా లేఖని ఆళ్ళ రామకృష్ణారెడ్డి సమర్పించారు.
ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టు వరద తాకిడికి రెండో గేటు కొట్టుకుపోయింది. దీంతో ప్రాజెక్టునుంచి నీరు వృథాగా పోతోంది.యుద్ధ ప్రాతిపదికన ఇంజనీరింగ్ అధికారులు స్టాప్ లాక్స్ పెట్టినా ఫలితం లేకుండా పోయింది. నీరు ఆగకపోవడంతో... మూడు గేట్లుఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం పరిమితి పదిలక్షలకు పెంపు, మహిళలకి మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం పథకాలని ప్రారంభించారు. ఆరోగ్య శ్రీ లోగో, పోస్టర్ని సిఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
తెలంగాణ మూడో శాసనసభ కొలువుదీరింది. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయించారు.మొదట సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత మిగతా ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు.
సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా గాంధీ భవన్లో పుట్టినరోజు ఘనంగా జరిగాయి. గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేక్ కట్ చేసి సోనియాగాంధీకి విషెస్ తెలిపారు. ముఖ్యమంత్రిగా ఎన్నికైన తరువాత మొదటిసారి రేవంత్ రెడ్డి గాంధీభవన్ రావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. సోనియా గాంధీకి 78 వ పుట్టిన రోజు సందర్భంగా రేవంత్ రెడ్డి 78 కిలోల కేక్ కట్ చేశారు.