Home / ప్రాంతీయం
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కి కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య సంచలన బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబే కాబోయే ముఖ్యమంత్రి అని, ఇందులో రెండవ మాట లేదని టిడిపి ప్రధాన నారా లోకేష్ ప్రకటించడాన్ని మీరు అంగీకరిస్తున్నారా అని జోగయ్య నిలదీశారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. రేపటి నుంచి జనవరి 1 వరకు వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులకు అవకాశం కల్పిస్తున్నారు. భక్తులకు ఆన్ లైన్ ద్వారా రెండు లక్షల 25 వేల టోకెన్లను టీటీడీ జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో సామాజిక ఫించన్లలో కోత విధించి రూ.291 కోట్లు కాజేసారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. గురువారం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నెలరోజుల్లో 19 వేలమంది ఫించన్లకు కోత పెట్టారని ఆయన చెప్పారు.
విశాఖపట్నంలో వైసీపీ అక్రమాలపై పోరాడితే జనసేన పార్టీ కార్పోరేటర్ మూర్తి యాదవ్‌ను చంపేస్తామని బెదిరించడం అధికార పక్షం నిరంకుశ వైఖరిని తెలియజేస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. ప్రశ్నించడం, చట్ట ఉల్లంఘనలపై పోరాడటం ప్రజాస్వామ్యంలో భాగమని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీని సీఎం జగన్ ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో జగన్ గురువారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వరుసగా రెండో ఏడాది కూడా విద్యార్థులకు ప్రభుత్వం ట్యాబ్ లను అందజేస్తోంది.
బిగ్‌బాస్ 7 సీజన్ విజేత పల్లవి ప్రశాంత్‌ను సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల కొల్గూరులో జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన సోదరుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. బిగ్ బాస్ టైటిల్ గెలిచన రోజు రాత్రి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల ధ్వంసం కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు ప్రశాంత్‌పై కేసు నమోదు చేశారు.
దేశంలో అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ అందించిన ఏకైక ప్రభుత్వం తమదని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో విద్యుత్ రంగంపై ప్రభుత్వం శ్వేత పత్రం ప్రకటించిన నేపధ్యంలో ఆయన సమాధానమిచ్చారు. నీతి అయోగ్ తమ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ నివేదిక పంపించిందని తెలిపారు.
విద్యుత్ రంగం పరిస్థితిపై అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి సభలో మంత్రి భట్టి విక్రమార్క చదివి వినిపించారు. ప్రస్తుతం అప్పుల పరిస్థితి చూస్తే.ఆందోళన కరంగా ఉందని తెలిపారు.
రాష్ట్రంలో విధ్వంస పాలనకు జగన్ నాంది పలికారని ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కు వెళ్లిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయనగరం జిలా్ల పోలేపల్లి వద్ద బుధవారం రాత్రి యువగళం- నవశకం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
ప్రజలు పాదయాత్ర చేస్తే పోరాటం అవుతుంది.. రాక్షస పాలనలో పోరాటం చేస్తే విప్లవం అవుతుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. బుధవారం రాత్రి యువగళం-నవశకం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తాడేపల్లి తలుపులు బద్దలు కొట్టే వరకు యుద్ధం ఆగదని అన్నారు.