Home / ప్రాంతీయం
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ మేరకు న్యూయర్ మార్గదర్శకాలను జారీ చేశారు. రాత్రి ఒంటి గంటలోపే వేడుకలు ముగించాలని ప్రజలకు సూచించారు. అశ్లీల నృత్యాలకు అనుమతి లేదన్న పోలీసులు.. వేడుకల్లో 45 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం రాకుండా చూసుకోవాలన్నారు.
చిత్తూరు జిల్లా నగిరిలో ఎవరికి సీటు ఇచ్చినా జగనన్న సైనికురాలుగా పని చేస్తానని ఏపీ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా ప్రకటించారు. ఈ ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. రోజాకి సీటు లేదని ప్రచారం చేసినంత మాత్రాన ఎవరూ భయపడరని రోజా అన్నారు.
సహజ వనరుల దోపిడీలో వైసీపీ నాయకులు కొత్త రికార్డులు సృష్టిస్తున్నారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ నాయకుల విలువైన క్వార్ట్జ్ లాంటి ఖనిజాలను కొల్లగొడుతున్న తీరు, మైనింగ్ ముసుగులో పేదలను భయాందోళనలకు గురి చేస్తున్న తీరు విస్మయం కలిగిస్తోందన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ తొలి పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పిఎసి) సమావేశం సోమవారం గాంధీభవన్‌లో జరిగింది. రాబోయే లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్రం నుండి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని పోటీకి దింపాలని కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది.కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఈ విషయాన్ని తెలియజేసారు.
వైఎస్ వివేకా హత్య కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, కేసు దర్యాప్తు చేసిన సీబీఐ ఎస్పీ రాంసింగ్‌పై పులివెందులలో కేసు నమోదయ్యింది. కృష్ణారెడ్డి ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కోర్టు సునీత, రాజశేఖరరెడ్డి, రాంసింగ్‌పై కేసు నమోదుచేయాలని ఆదేశించింది. దీంతో పులివెందులలో ఐపీసీ సెక్షన్ 156 (3) కింద కేసు నమోదుచేశారు.
తెలుగుదేశం పార్టీ జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం విజయోత్సవ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. నిన్న జరిగిన చంద్రబాబు, పవన్ భేటీలో విజయోత్సవ సభకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. లోకేష్ యువగళం పాదయాత్ర నేటితో ముగియనుండటంతో ఎల్లుండి విజయనగరం జిల్లా భోగాపురంలో విజయోత్సవ సభను నిర్వహించనున్నారు.
శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ రానున్నారు. ఈరోజు హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి ఐదు రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. డిసెంబర్ 23న తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.
హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వెలుపల ఫ్యాన్స్ అత్యుత్సాహం చూపించారు. బిగ్ బాస్ ఫైనల్ ముగిసిన అనంతరం స్టూడియో నుంచి బయటికొచ్చే కార్లపై దాడి చేశారు. తొలుత రన్నరప్ అమర్ దీప్ కారు అద్దాలను ధ్వంసం చేశారు. తర్వాత కాసేపటికి బయటికొచ్చిన ఈ సీజన్ కంటెస్టెంట్ అశ్విని శ్రీ, పాత సీజన్ కంటెస్టెంట్ గీతు రాయల్ వాహనాలపైనా దాడి చేశారు.
గత కాంగ్రెస్ హయాంలో అధ్వాన్నంగా ఉన్న విద్యుత్ రంగాన్ని 2014 తర్వాత పునరుద్ధరించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీ రామారావు (కేటీఆర్) అన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో మోటార్లు కాలిపోయాయని, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయాయని, ఓల్టేజీలో హెచ్చుతగ్గులు ఉన్నాయని ఎన్నో వార్తలు వచ్చాయన్నారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్పై సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. తెలంగాణలో కుటంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారని ప్రజలు ఇచ్చిన తీర్పును నేతలు గుర్తుంచుకోవాలని అన్నారు. అందెశ్రీ కవితతో సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ప్రారంభించారు.