PM Modi: భవిష్యత్ భారత్‌దే.. మరో ఐదేళ్లల్లోనే లక్ష్యాలను సాధిస్తామని ప్రధాని వెల్లడి
![PM Modi: భవిష్యత్ భారత్‌దే.. మరో ఐదేళ్లల్లోనే లక్ష్యాలను సాధిస్తామని ప్రధాని వెల్లడి](https://s3.ap-south-1.amazonaws.com/media.prime9news.com/wp-content/uploads/2025/02/PM-Modi-says-India-on-track-to-meet-2030-energy-goals.webp)
PM Modi says India on track to meet 2030 energy goals: భారత్ వృద్ధి చెందడంతో పాటు ప్రపంచ వృద్ధి రేటును సైతం నడిపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ మేరకు భారత ఇంధన వార్షికోత్సవాలు -2025ను ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. భారత్ తన ఇంధన లక్ష్యాలను 2030 నాటికి చేరుకుంటుందన్నారు. మరో ఐదేళ్లల్లో భారత్ ప్రధాన మైలురాళ్లను అధికమిస్తోందని పేర్కొన్నారు.
ఈ ఏడాది అక్టోబర్ నాటికి 20 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని చేరుకుంటుందని ప్రధాని అన్నారు. ఇందులో 500 గిగావాట్ల సౌర ఉత్పత్తి సామర్థ్యం పెంచడం, నికర జీరో కర్బన ఉద్గార లక్ష్యాన్ని చేరడం, ప్రతీ ఏటా 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.
దేశంలో 500 మిలియన్ మెట్రిక్ టన్నుల ఫీడ్ స్టాక్ ఉందని ప్రధాని అన్నారు. సౌర ఉత్పత్తి సామర్థ్యంలో మన దేశం ప్రపంచ వ్యాప్తంగా మూడో అతిపెద్ద సౌరశక్తిని ఉత్పత్తి దేశంగా నిలిచామన్నారు. ఈ సమయంలో పునరుత్పాదకేతర ఉత్పత్తి సామర్థ్యం 3 రెట్టు పెరిగిందన్నారు. గత పదేళ్లలో సౌరశక్తి ఉత్పత్తి 32 రెట్లు పెరిగిందని వివరించారు.