Home / ప్రాంతీయం
హైదరాబాద్ గుడిమల్కాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అంకుర ఆస్పత్రిలో మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని మంటలు అదుపు చేయడంతో పెనుముప్పు తప్పింది. ఆసుపత్రిలో ఎక్కువగా గర్భిణీలు, చిన్నపిల్లలు ఉన్నారు. ఫైర్ సిబ్బంది సకాలంలో మంటలు అదుపులోకి తేవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూటే అగ్నిప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల మార్పు అన్నది అంత ఈజీ కాదని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. తనను సీఎంను చేయాలని సోనియా గాంధీ వద్దకు జగన్ వెళ్ళినప్పుడు ఆయనకు ఎదురైన అనుభవాలే ఇప్పుడు ఎమ్మెల్యేలకి ఎదురవుతున్నాయని ఉండవల్లి చెప్పారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్‌నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. గత ఎన్నికల్లో వైసిపి గెలుపులో ప్రశాంత్ కిషోర్ ప్రధాన పాత్రని పోషించారు. వైసీపీకి పని చేస్తున్న ప్రశాంత్ కిషోర్ హఠాత్తుగా నారా లోకేష్ వెంట కనిపించడంతో వైసిపి నేతలు షాక్ తిన్నారు.
మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు వర్దంతి సందర్భంగా నెక్లెస్ రోడ్‌లోని పీవీ జ్ఞానభూమి వద్ద సీఎం రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నివాళులర్పించారు. దేశకీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ నరసింహారావు అని రేవంత్ అన్నారు.
తెలంగాణలో తక్కువ దూరాలు ప్రయాణించే మహిళా ప్రయాణీకులు ఎక్స్ ప్రెస్ బస్సుల కన్నా పల్లె వెలుగు బస్సులను ఆశ్రయించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్జప్తి చేసారు. తక్కువ దూరాలకు కూడా పలువురు ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ప్రయాణిస్తున్నట్లు ఆర్టీసీ దృష్టికి వచ్చింది.
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమల క్షేత్రంలో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా చేరుకున్నారు. తెల్లవారుజామున 1:30 నిమిషాలకే విఐపిలను దర్శనానికి అనుమతించారు.
ఏపీలో రైతు భరోసా కేంద్రాలు రైతు నిరాశ కేంద్రాలుగా మారాయని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. శుక్రవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్నదాతకు ఒరిగింది సున్నా అని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రాలకి పోటీగా రేపు స్వేద పత్రాన్ని విడుదల చేస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆయన ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు.
తెలంగాణలో వాహనదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 26 నుండి జనవరి 10, 2024 వరకు పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై తగ్గింపును ప్రకటించింది. తమ వాహనాలపై పెండింగ్‌లో ఉన్న చలానాలను ఈ-చలాన్ వెబ్సైట్ ద్వారా డిస్కౌంట్ ఉన్నంత వరకు క్లియర్ చేయాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల చలాన్లు పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ సీపీ శ్రీనివాస రెడ్డి ఈ ఏడాది క్రైం వార్షిక నివేదికను విడుదల చేశారు. గతంతో పోల్చితో హైదరాబాదులో 2 శాతం క్రైం రేట్ పెరిగిందని తెలిపారు. ఈ ఏడాది 13 కేసుల్లో 13 మందికి జీవిత ఖైదు పడిందని.. గతేడాదితో పోల్చితే ఈ సారి చిన్నారులపై 12 శాతం కేసులు తగ్గాయని వివరించారు.