Nara Brahmani: నారా లోకేష్ పై భార్య బ్రాహ్మణి ఇంట్రెస్టింట్ ట్వీట్
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖల మంత్రిగా బాధ్యలు చేపట్టిన తన భర్త.. మంత్రి నారా లోకేష్ కు ట్విట్వర్ వేదికగా బ్రాహ్మణి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ గ్రామాలనుంచి అమెరికా వెడితే లోకేష్ అమెరికా నుంచి వచ్చి గ్రామాల రూపురేఖలు మార్చడానికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు.
Nara Brahmani: ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తన భర్త.. మంత్రి నారా లోకేష్ కు ట్విట్వర్ వేదికగా బ్రాహ్మణి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ గ్రామాలనుంచి అమెరికా వెడితే లోకేష్ అమెరికా నుంచి వచ్చి గ్రామాల రూపురేఖలు మార్చడానికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు.
పల్లె గడపల వద్దకు వచ్చి..(Nara Brahmani)
అంతా పల్లెల్లో నుండి అమెరికా వెళితే.. నువ్వు అక్కడ చదివి పల్లె గడపల వద్దకు వచ్చి.. సిమెంట్ రోడ్లతో.. ఎల్ఇడి వెలుగులతో.. వాటి రూపురేఖలు మార్చేశావ్… పనిలో పడి విమర్శలను పట్టించుకోకుండా.. అవార్డుల పంట పండించావు. నీ వ్యక్తిత్వ హననం చేసిన వారు అవాక్కయ్యేలా వాళ్ళకు నువ్వేంటో తెలియజేశావు… సవాళ్లతో కూడిన శాఖలను సాహసంతో తీసుకొన్నావు. నీ సమర్ధతతో నేటితరం.. భావితరం భాగ్యరేఖలు నువ్వు మార్చగలవనే నమ్మకం నాకుంది.కుటుంబపరంగా ఎల్లవేళలా మీకు మా సహకారం ఉంటుంది. కంగ్రాట్స్ డియర్ అని ఎక్స్ లో బ్రాహ్మణి పోస్ట్ చేశారు.