Byreddy Siddharth Reddy: జగన్ ప్రైవేట్ సైన్యం.. అందరినీ లేపేస్తాం జాగ్రత్త- బైరెడ్డి సిద్ధార్థరెడ్డి
జగన్ కనుసైగ చేస్తే చాలని.. ఆయన కోసం పనిచేయడానికి ప్రైవేట్ సైన్యం ఉందని శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు.
Byreddy Siddharth Reddy: జగన్ కనుసైగ చేస్తే చాలని.. ఆయన కోసం పనిచేయడానికి ప్రైవేట్ సైన్యం ఉందని శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు. బ్రోకర్ రాజకీయాలకు అలవాటు పడి కొంత మంది పొత్తుల కోసం తిరుగుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దొంగను కలిసిన వారిని ఏమంటారని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా ఎలాంటి పొత్తులు పెట్టుకున్నా ఫర్వాలేదని.. పార్టీ యువతంతా సీఎం జగన్‌కు ప్రైవేట్ సైన్యంగా పనిచేస్తామన్నారు.
పవన్, చంద్రబాబు ఎప్పుడూ కలిసేవున్నారు..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ ఒక్కటేనని తమకెప్పుడో అర్థమయ్యిందని.. ఇప్పుడది మరోసారి బయటపడిందని అన్నారు. పవన్, చంద్రబాబు ఎప్పుడూ కలిసేవున్నారు.. ఇప్పుడు ఖాళీగా వున్నారు కాబట్టి భేటీ అయ్యారన్నారు. వాళ్ళు విడిపోతే ఏదయినా మాట్లాడతాం. కానీ కలిసుంటే ఏం మాట్లాడతామన్నారు. పవన్, చంద్రబాబు కలిసొచ్చినా, విడిపోయి వచ్చినా మాకేం కాదు. మళ్లీ 175 కి 175 సీట్లు కొట్టి తీరతామని అన్నారు. ఒక గ్రామానికి లేదంటే ఒక వార్డుకు జగన్, వైసీపీ ప్రభుత్వం వివిధ పథకాల కింద ఖర్చుచేసిన డబ్బులకంటే వేరే ఏ ప్రభుత్వమైనా ఎక్కువ ఖర్చుచేస్తే వాళ్లకే ఓటు వేయమని చెప్పాలన్నారు.
వారసత్వ రాజకీయాలు నిలబెట్టుకోవడం కష్టం..
రెండు రోజులకిందట విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సిద్ధార్థరెడ్డి(Byreddy Siddharth Reddy) వారసత్వ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన యువనేతలపై 24 గంటల పాటు మోయలేనంత భారం ఉంటుందని అన్నారు. అలాంటి యువనేతల జీవితం పూల పాన్పు కాదని చెప్పారు. తమ తాతలు, తండ్రుల వారసత్వాన్ని నిలబెట్టుకోవడం సులభతరం కాదని వ్యాఖ్యానించారాయన. ఎప్పటికప్పుడు తమను తొక్కేయాలని చూసే శక్తులు, కంటికి కనిపించని శతృవులు పొంచివుంటారని వాటన్నింటినీ అధిగమించిన ఒక స్థాయికి చేరుకోవాలంటే సామాన్యమైన విషయం కాదని చెప్పారు.
వైసీపీకి ప్రైవేట్ సైన్యం ఎందుకు?
బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వ్యాఖ్యలను జనసేన నేత కందుల దుర్గేష్ తప్పుపట్టారు. వైసీపీకి ప్రైవేట్ సైన్యం ఉందని చెప్పటం దుర్మార్గం. అధికారంలో ఉన్న వైసీపీకి ప్రైవేట్ సైన్యం ఎందుకు? ప్రైవేట్ సైన్యం పేరుతో విపక్షాలను భూస్థాపితం చేసే విధంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి. వైసీపీని, జగన్ ప్రైవేట్ సైన్యాన్ని జనం ఇంటికి పంపుతారు. అని కందుల దుర్గేష్ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి:
Waltair Veerayya: లక్ష్మణరేఖనైనా దాటుతాను కానీ సురేఖను దాటను.. సుమ అడ్డాలో చిరు కామెంట్స్
Nandamuri Balakrishna : తన డ్రీమ్ ప్రాజెక్టు గురించి ఓపెన్ అయిన బాలకృష్ణ..
KGF 3: 2025లో సెట్స్ పైకి వెళ్లనున్న KGF 3.. మరోసారి రాకీభాయ్ గా కనిపించనున్న హీరో యష్
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/