Last Updated:

Minister KTR Comments: తెలంగాణ పల్లెల్లో హార్వెస్టర్లు.. పట్టణాల్లో ఇన్వెస్టర్లు పరుగులు పెడుతున్నారు.. మంత్రి కేటీఆర్

తెలంగాణ శాసన సభలో శనివారం పల్లె, పట్టణ ప్రగతిపై చర్చ జరిగింది. రాబోయే తరాలు గుర్తుపెట్టుకునేలా తెలంగాణను అభివృద్ధి చేశామని మంత్రి కేటీఆర్ అన్నారు. కట్టడం మాత్రమే తమకు తెలుసని.. ప్రతిపక్షాలకు కూలగొట్టడం మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు.

Minister KTR Comments:  తెలంగాణ పల్లెల్లో హార్వెస్టర్లు.. పట్టణాల్లో ఇన్వెస్టర్లు పరుగులు పెడుతున్నారు.. మంత్రి కేటీఆర్

Minister KTR Comments: తెలంగాణ శాసన సభలో శనివారం పల్లె, పట్టణ ప్రగతిపై చర్చ జరిగింది. రాబోయే తరాలు గుర్తుపెట్టుకునేలా తెలంగాణను అభివృద్ధి చేశామని మంత్రి కేటీఆర్ అన్నారు. కట్టడం మాత్రమే తమకు తెలుసని.. ప్రతిపక్షాలకు కూలగొట్టడం మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు. సంక్షేమానికి పెద్ద పీఠ వేస్తూనే.. మౌలిక వసతులకు భారీగా కేటాయింపులు చేస్తున్నామన్నారు. పల్లెల్లో హార్వెస్టర్లు.. పట్టణాల్లో ఇన్వెస్టర్లు పరుగులు పెడుతున్నారని.. ఓట్ల కోసమే ప్రతిపక్షలు మాట్లాడుతున్నాయని కేటీఆర్ ఫైర్ అయ్యారు.

కేంద్రం అవార్డుల్లో 30 శాతం తెలంగాణకే.. (Minister KTR Comments)

తెలంగాణ అభివృద్ధికి నిర్మాణాత్మకంగా పని చేస్తున్నామని కేటీఆర్ అన్నారు. సంక్షేమానికి పెద్ద పీఠ వేస్తూనే, మౌలిక వసతులకు భారీగా కేటాయింపులు చేస్తున్నామని తెలిపారు. .తెలంగాణ‌లో ప్ర‌తి ఇంటికి సుర‌క్షిత మంచినీరు న‌ల్లాల ద్వారా అందుతుంద‌ని కేంద్ర మంత్రినే పార్ల‌మెంట్‌లో ప్ర‌క‌టించారని కేటీఆర్ చెప్పారు. న‌ల్ల‌గొండలో ఫ్లోరెడ్ ర‌క్క‌సిని రూపుమాపామని తెలిపారు. కేంద్రం ప్ర‌క‌టించిన అవార్డుల్లో 30 శాతం తెలంగాణ‌కే వ‌చ్చాయని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 2.28 ల‌క్ష‌ల డ‌బుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేప‌ట్టామన్నారు ఒక్క డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు ఏడు ఇందిర‌మ్మ ఇండ్ల‌తో స‌మానం. గృహ‌ల‌క్ష్మి ప‌థ‌కం కింద మ‌రింత మందికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తామ‌ని తెలిపారు.కాంగ్రెస్ ప‌రిపాల‌న‌లో మున్సిపాలిటీల‌కు డ‌బ్బులు ఇచ్చేవారు కాదని తమ హయాంలో కోట్లాది రూపాయలతో అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.

తెలంగాణలో సంక్షేమం సముద్రమంత.. అభివృద్ధి ఆకాశమంత ఉందని కేటీఆర్ అన్నారు. బ‌డ్జెట్ పెట్టుబ‌డి వ్య‌యంలో తెలంగాణే ముందున్నాదని చెప్పిన కేటీఆర్ తాను చెప్పిన దాంట్లో తప్పుంటే ఎన్నికల్లో ఓడించాలని సవాల్ చేసారు. భట్టి విక్రమార్క ప్రతిపక్షంలో వందేళ్లు ఉండాలన్నారు. తెలంగాణకు మూడోసారి కేసీఆర్ సీఎం కావడం ఖాయమని స్పష్టం చేసారు.