Last Updated:

CM Jagan’s Meeting: వరద బాధిత కుటుంబాలతో సీఎం జగన్ సమావేశం

అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు.వరద బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. వరద బాధితులకు నిత్యావసరాలు అందజేశామని అన్నారు. అధికారులు తప్పులు చేస్తే చర్యలు తప్పవని జగన్ హెచ్చరించారు.

CM Jagan’s Meeting: వరద బాధిత కుటుంబాలతో సీఎం జగన్ సమావేశం

CM Jagan’s Meeting: అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు.వరద బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. వరద బాధితులకు నిత్యావసరాలు అందజేశామని అన్నారు. అధికారులు తప్పులు చేస్తే చర్యలు తప్పవని జగన్ హెచ్చరించారు. ప్రతి కుటుంబానికి వరద సాయం అందించామని తెలిపారు. సహాయకచర్యలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించామని  35 గ్రామాలకు సంబంధించిన 48 హాబిటేషన్లకు న్యాయం చేస్తామని జగన్ పేర్కొన్నారు.

త్వరలోనే పోలవరం బాధితులకు ప్యాకేజీ ..(CM Jagan’s Meeting)

పోలవరం ముంపు బాధితులకు అందవలసిన ప్యాకేజీకి త్వరలోనే కేంద్రం ఆమోదం లభిస్తుందని దానిని పారదర్శకంగా అమలు చేస్తామని అన్నారు. పునరావసా ప్యాకేజీలో కేంద్రం నిధులకు తోడు రాష్ట్రం కూడా చెల్లిస్తుందన్నారు. సెంట్రల్ వాటర్ కమీషన్ నిబంధనల ప్రకారమే పోలవరం నిర్మాణంలో ముందుకు వెడుతున్నామని వాటి మేరకే డ్యాంలో నీళ్లు నింపుతున్నామన్నారు. వరదబాధితులకు అండగా మొత్తం యంత్రాంగం అండగా నిలిచిందని వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. వరదలతో ఇళ్లు దెబ్బతిన్నవారికి రూ.10 వేలు. ఇళ్లల్లోకి నీరు వచ్చిన వారికి రూ.2 వేలు ఆర్దికాసాయం అందజేస్తామన్నారు. సాయం అందని వారు తనకు ఫిర్యాదు చేయాలన్నారు. సీఎం జగన్ మంగళవారం బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోపర్యటించి వరద ప్రభావిత గ్రామాల ప్రజలను పరామర్శిస్తారు.