Minister Jogi Ramesh: చంద్రబాబు తానే రాళ్లు వేయించుకున్నాడు.. జోగి రమేష్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనపైన తానే రాళ్లు వేయించుకుని కొత్త నాటకానికి తెరతీసాడని ఏపీ మంత్రి జోగి రమేష్ ఆరో్పించారు. నందిగామలో చంద్రబాబు రోడ్ షోలో రాయి పడిందనే టీడీపీ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.

Andhra Pradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనపైన తానే రాళ్లు వేయించుకుని కొత్త నాటకానికి తెరతీసాడని ఏపీ మంత్రి జోగి రమేష్ ఆరో్పించారు. నందిగామలో చంద్రబాబు రోడ్ షోలో రాయి పడిందనే టీడీపీ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.
విషపూరిత రాజకీయాలకు చంద్రబాబు చిరునామా. రాళ్లు విసిరించుకోవడం బాబుకు సాధారణమే. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు క్షమాపణ చెప్పాల్సింది చంద్రబాబే. ఈ నాటకానికి తెరతీసింది చంద్రబాబే. ఆయన ఓ కుసంస్కారి. 4 బస్సులు తగలబెట్టకుంటే అది బంద్ కాదన్నది చంద్రబాబే అని రమేష్ అన్నారు.
పార్ట్-1లో పవన్ మీద రెక్కీ అని హడావుడి చేశాడు. అది తాగుబోతులు చేసిన వీరంగం అని తేలింది. పార్ట్-2లో రాయి వేసినట్టు హడావుడి చేస్తున్నాడు. రాయి ఎవరితో వేయించుకున్నాడో కూడా తేలుస్తాము. అప్పట్లో మల్లెల బాబ్జికి కత్తి ఇచ్చి పంపిందెవరో కూడా ప్రజలకు తెలుసు. చంద్రబాబు చరిత్రంతా ఇలాంటి కుట్రలే. ఇప్పుడు నందిగామ వెళ్లేలోపే రాయి వేయించుకునే స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు.