Sankarabharanam Movie: శంకరాభరణం సినిమాకు అరుదైన గౌరవం
అలనాటి క్లాసిక్ చిత్రాలకు ఇప్పుడు అరుదైన గౌరవం లభిస్తోంది. కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ఆల్‌టైమ్ క్లాసిక్ చిత్రం ‘శంకరాభరణం’. ఈ మూవీకి గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అరుదైన గౌరవం దక్కింది.
Sankarabharanam Movie: అలనాటి క్లాసిక్ చిత్రాలకు ఇప్పుడు అరుదైన గౌరవం లభిస్తోంది. కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ఆల్‌టైమ్ క్లాసిక్ చిత్రం ‘శంకరాభరణం’. ఈ మూవీకి గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అరుదైన గౌరవం దక్కింది.
రీస్టోర్డ్ ఇండియన్ క్లాసిక్ విభాగానికి గానూ ఈ సినిమా ఎంపికైంది. అప్పటికి ఇప్పటికి ఎప్పటికి మరుపురాని మరువలేని భారతదేశ సినీ చరిత్రలో క్లాసిక్స్‌గా నిలిచే కొన్ని సినిమాలుంటాయి. అలాంటి మూవీలను నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా గుర్తించి వాటిని డిజిటలైజ్ చేసి భద్రపరుస్తుంటుంది. కాగా ఈ ఏడాది ఈ కాటగిరీకి గానూ ‘శంకరాభరణం’ చిత్రాన్ని ఎంపిక చేశారు. శాస్త్రీయ సంగీత ఔన్నత్యాన్ని చాటిచెప్పే కథాంశంతో తెరకెక్కించిన ఈ చిత్రం ఎనభై దశకంలో సంగీత ప్రేమికుల్ని విశేషంగా ఆకట్టుకుంది. తెలుగు సినీ రంగ చరిత్రలో ఆణిముత్యాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ చిత్రంలోని పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి. జేవీ సోమయాజులు, మంజుభార్గవి, చంద్రమోహన్, తులసి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను పూర్ణోదయ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించారు. ఆ కాలంలో ఈమూవీ అప్పటి వరకు ఎన్నడూ చూడని కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది.
ఇదీ చదవండి: సుధా కొంగర డైరక్షన్ లో రతన్ టాటా బయోపిక్