Lucky Bhaskar2: లక్కీ భాస్కర్ సీక్వెల్ పై కీలక అప్డేట్..!

Update on Lucky Bhaskar2: మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ లక్కీ భాస్కర్. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా.. నాగవంశీ నిర్మించాడు. ఈ మూవీ అనంతరం వెంకీ అట్లూరీ సూర్యతో మరో సినిమా చేస్తున్నాడు. అయితే తాజాగా తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ కు సంబంధించి వెంకీ అట్లూరి కీలక అప్డేట్ ఇచ్చారు. తనకు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన లక్కీ భాస్కర్ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ప్రకటించాడు.
గతేడాది విడుదలైన లక్కీ భాస్కర్ మూవీ అనూహ్య విజయాన్ని అందుకుంది. విమర్శకుల ప్రశంసలను సైతం పొంది బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఓ సాధారణ బ్యాంక్ ఉద్యోగి జీవితం అనుకోని మలుపులు తిరిగి, ఆర్థిక అక్రమాల్లో చిక్కుకోవడం అనే కథాంశం ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా క్లైమాక్స్ కూడా సీక్వెల్ తీసే విధంగా ముగియడంతో, అప్పటి నుంచే పార్ట్ 2 గురించి ఊహాగానాలు వస్తున్నాయి.
ప్రస్తుతం వెంకీ అట్లూరి కోలీవుడ్ స్టార్ సూర్యతో ‘సూర్య46’ అనే వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ బిజీలో ఉన్నప్పటికీ, లక్కీ భాస్కర్ సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. అయితే ధనుష్ తో తాను తీసిన ‘సార్’ మూవీకి సీక్వెల్ ఉండదని కూడా చెప్పాడు. లక్కీ భాస్కర్ సీక్వెల్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది, కథాంశం ఎలా ఉంటుంది అనే విషయాలపై ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.