Last Updated:

New Secretariat: కొత్త సచివాలయం ప్రారంభం.. ఎప్పుడో తెలుసా?

New Secretariat: కొత్త సచివాలయం ప్రారంభం.. ఎప్పుడో తెలుసా?

New Secretariat: నూతన సచివాలయ ప్రారంభానికి ముహుర్తం ఖరారైంది. సచివాలయ భవనాన్ని కేసీఆర్ పుట్టిన రోజైనా ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని మంత్రి
వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నూతన సచివాలయాన్ని (New Secretariat) నిర్మిస్తుంది.

నూతన సచివాలయాన్ని సంక్రాంతికి ప్రారంభించాలని ముందు అనుకున్నా.. అనుకున్న స్థాయిలో నిర్మాణం కాలేదు. దీంతో ప్రారంభతేదీని మార్చాలని అధికారులు నిర్ణయించారు. ఇక నూతన తేదీని
రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. కేసీఆర్ పుట్టిన రోజున దీనిని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. దీంతో నూతన సచివాలయ ప్రారంభానికి ముహుర్తం ఖరారైంది.

నూతన సచివాలయాన్ని అత్యంత హంగులతో తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంత సచివాలయం ప్రధాన ద్వారం లుంబినీ పార్కు ఎదురుగా ఉండేలా నిర్మాణం చేపట్టారు.

తెలంగాణ రాకముందు సైతం ఇక్కడే ప్రధాన ద్వారం ఉండేది. కేసీఆర్ కు వాస్తుపరంగా నచ్చడంతో ఇప్పుడు అక్కడే ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేశారు.

కేసీఆర్ కాన్వాయ్ ఇందులోనుంచి వెళ్లే విధంగా రూపొందించారు.

మెుత్తంగా ఇక్కడ ప్రధాన నాలుగు ద్వారాలు ఏర్పాటు చేశారు. ప్రధాన ద్వారం తూర్పు దిశలో ఉండగా.. ఎన్టీఆర్‌ గార్డెన్స్‌ వైపు ఉద్యోగుల కోసం ప్రవేశ ద్వారాన్ని నిర్మించారు. ఇపుడు బిర్లా మందిరం వైపు రోడ్డులో  ఉన్న పౌరసరఫరాల శాఖ పెట్రోలు బంక్ ను తొలగించారు. ఆ పెట్రోల్ బంక్ ని సికింద్రాబాద్‌ ఆర్‌.పి.రోడ్డులోకి మార్చారు.

తొలగించిన పెట్రోలు బంక్ స్థానంలో.. సందర్శకుల కోసం గేటు నిర్మిస్తున్నారు. సులువుగా ఉండేందుకు తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ నుంచి నేరుగా ఓ రోడ్డు నిర్మాణం చేపట్టారు.

కేసీఆర్ కు వాస్తుపరంగా నమ్మకాలు ఉండటంతో మూడు ద్వారాలను కాదని నాలుగో ద్వారం నిర్మిస్తున్నారు.

సచివాలయం వెనకవైపు దిశలో నాలుగో ద్వారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్పా ఈ ద్వారాన్ని వినియోగించరు.

సాధారణ రోజుల్లో ఈ ద్వారాన్ని మూసివేస్తారు.

ఫిబ్రవరి 17 అధికారికంగా సచివాలయం ప్రారంభం.

సచివాలయాన్ని ప్రారంభించనున్న కేసీఆర్.

పనులను పర్యవేక్షిస్తున్న మంత్రి వేముల.

అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్న మంత్రి.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/