Last Updated:

Madya pradesh: ఈ రియల్ మోగ్లీని చూశారా.. ఈ విద్యార్థి కాలేజీకి ఎలా వెళ్తున్నాడో చూడండి..!

నేటి యువత కళాశాలకు వెళ్లాలంటే అబ్బో మాములుగా రెడీ అవుతారా చెప్పండి. దువ్విన తలనే దువ్వడం అద్దిన పౌడర్ అద్దడం అద్దం వదలకపోవడం ఈపాట గుర్తొస్తుంటది వీళ్లు కాలేజీలకు వెళ్లేటప్పుడు స్టంట్స్ చూస్తుంటే.. కానీ ఈ యువకుడు మాత్రం అందుకు భిన్నం అని చెప్పవచ్చు.

Madya pradesh: ఈ రియల్ మోగ్లీని చూశారా.. ఈ విద్యార్థి కాలేజీకి ఎలా వెళ్తున్నాడో చూడండి..!

Madya pradesh: నేటి యువత కళాశాలకు వెళ్లాలంటే అబ్బో మాములుగా రెడీ అవుతారా చెప్పండి. దువ్విన తలనే దువ్వడం అద్దిన పౌడర్ అద్దడం అద్దం వదలకపోవడం ఈపాట గుర్తొస్తుంటది వీళ్లు కాలేజీలకు వెళ్లేటప్పుడు స్టంట్స్ చూస్తుంటే.. కానీ ఈ యువకుడు మాత్రం అందుకు భిన్నం అని చెప్పవచ్చు.

సాధారణంగా కళాశాలకు వెళ్లాలంటే ప్యాంటు, షర్టు, లోదుస్తులు, చేతి రుమాలు వంటివి ఉండాల్సిందే. కానీ మధ్యప్రదేశ్‌లోని బడ్‌వానీకి చెందిన కన్నయ్య అనే విద్యార్థికి మాత్రం అండర్‌వేర్‌, తువ్వాలు ఉంటే చాలు. ‘జంగిల్‌ బుక్‌’ సినిమాలో మోగ్లీ లాగా కనిపిస్తుంటాడు ఈ విద్యార్థి. అయితే ఈ యువకుడికి చిన్నప్పటి నుంచి దుస్తులు అంటే చిరాకు. ఎవరైనా చొక్కా, ప్యాంటు ధరించాలని ఎవరైనా చెబితే చాలు వారితో మాట్లాడడం మానేస్తాడు. వెళ్లడం ప్రారంభించినప్పుడు కన్నయ్య తల్లిదండ్రులు అతడికి నచ్చజెప్పి బట్టలు వెయ్యడానికి ప్రయత్నించారు. కానీ అతను వినిపించుకోలేదు. టవల్ తో మాత్రమే పాఠశాలకు వెళ్లేవాడు అలా ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తయ్యింది. బడ్‌వానీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కన్నయ్యను ఉన్నత విద్యకోసం చేర్పించేందుకు వెళితే యాజమాన్యం అతనికి ప్రవేశం కల్పించలేదు. చివరకు ఈ విషయంపై కలెక్టర్‌ అనుమతి తీసుకుని ఉన్నత విద్యను అభ్యసించాడు.

ఇకపోతే కళాశాలలో కచ్చితంగా దుస్తులు ధరించాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందిన కన్నయ్య పదో తరగతి తర్వాత చదువు ఆపేస్తానని చెప్పాడు. దానికి ఉపాధ్యాయులు అందుకు అంగీకరించలేదు. చాలా శ్రమపడి కళాశాలలో అతన్ని చేర్పించారు. ప్రస్తుతం కన్నయ్య ఇంటర్‌ చదువుతోన్నాడు. ఇప్పటికీ కన్నయ్య ఓ అండర్‌వేర్‌, పైనుంచి తువ్వాలు వేసుకుని మాత్రమే కళాశాలకు వెళ్తుంటాడు తప్ప ఒంటిపై ఇంకేమీ ధరించడు. ఇలా చూసినవారందరూ కన్నయ్యను మరో మోగ్లీ అంటూ వింతగా చూస్తుంటారు.

ఇదీ చదవండి: బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సమాధి.. మునుగోడులో తీవ్ర కలకలం

ఇవి కూడా చదవండి: