Jammu and Kashmir Target killing : జమ్ముకశ్మీర్ లో మరో టార్గెట్ కిల్లింగ్.. పుల్వామాలో కశ్మీర్ పండిట్ ను కాల్చిచంపిన ఉగ్రవాదులు..
జమ్ము కశ్మీర్ లోని పుల్వామాలో ఏటీఎంకు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న 40 ఏళ్ల కాశ్మీరీ పండిట్‌ను అనుమానిత ఉగ్రవాదులు హతమార్చారు. సంజయ్ శర్మ అనే వ్యక్తిపై కాల్పులు జరపడంతో ఆసుపత్రి పాలయ్యాడు
Jammu and Kashmir Target killing : జమ్ము కశ్మీర్ లోని పుల్వామాలో ఏటీఎంకు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న 40 ఏళ్ల కాశ్మీరీ పండిట్‌ను అనుమానిత ఉగ్రవాదులు హతమార్చారు. సంజయ్ శర్మ అనే వ్యక్తిపై కాల్పులు జరపడంతో ఆసుపత్రి పాలయ్యాడు. తీవ్ర గాయాలపాలైన అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.నిషేధించబడిన ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF), పాకిస్తాన్ కు చెందిన లష్కరే తోయిబా మద్దతు ఉన్న సంస్థ, సంజయ్ శర్మపై దాడికి బాధ్యత వహించింది.
భయాందోళనలో కాశ్మీరీ పండిట్ సమాజం..(Jammu and Kashmir Target killing)
పుల్వామా కు చెందిన సంజయ్ శర్మ అనే పౌరుడిపై స్థానిక మార్కెట్‌కు వెళుతుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడంటూ కాశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేసారు.ఉగ్రదాడిని ఖండిస్తూ జమ్మూ కాశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు కవీందర్ గుప్తా మాట్లాడుతూ కేంద్రపాలిత ప్రాంతంలో ఉగ్రవాద గ్రూపులు ఉండకూడదని అన్నారు.సాధారణ స్థితికి వచ్చినప్పుడు, ఉగ్రవాద గ్రూపులు అలాంటి పనులు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అతను 40 సంవత్సరాలకు పైగా అక్కడే ఉన్నాడు. కాశ్మీరీ పండిట్ సమాజం భయాందోళనలో ఉంది. ఉద్యోగులు రోడ్లపైకి వచ్చారు. దీని వెనుక ఉన్న వారిని నిర్వీర్యం చేస్తారు. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని తెలిపారు.
గులాం నబీ ఆజాద్‌కు చెందిన డిపిఎపి, ఈ హత్యకు భద్రతా లోపం కారణమని ఆరోపించింది. కశ్మీర్‌లోని మైనారిటీ వర్గాలకు భద్రత కల్పించడంలో ఎల్‌జీ పరిపాలన మరోసారి విఫలమైంది. కాశ్మీర్ లోయకు తిరిగి వెళ్లాలని ప్రభుత్వం కాశ్మీరీ పండిట్‌లపై ఒత్తిడి తెచ్చింది. ఇప్పుడు మరో కాశ్మీరీ పండిట్ హత్యకు గురయ్యాడు, ఈ ఘటనను ఖండిస్తున్నాం. ఈ ప్రజలకు భద్రత కల్పించడంలో ఎందుకు విఫలమయ్యారనేది ప్రభుత్వంపై తీవ్రమైన ప్రశ్నగా ఉంది, అని డిపిఎపి ప్రతినిధి అశ్వనీ హండా అన్నారు.
పండిట్జ ఉద్యోగులను జమ్మూలో సర్దుబాటు చేయాలి..
కశ్మీరీ పండిట్ మృతి పట్ల జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సంతాపం తెలిపారు.నేను తీవ్రంగా బాధపడ్డాను. ఈ రక్తపాతానికి ముగింపు పలకాలి. దురదృష్టవశాత్తూ, కాశ్మీరీ పండిట్‌లపై దాడులు కొనసాగుతున్నాయి. కాశ్మీరీ పండిట్లను రక్షించాలని లోయలోని ముస్లింలకు నేను విజ్ఞప్తి చేస్తాను. మనం ఏదో ఒక రోజు అల్లాను ఎదుర్కోవాలి. మన పండిట్ సోదరులను రక్షించడంలో విఫలమైతే మనం అల్లాకు ఏమి చెబుతామని అబ్దుల్లా అన్నారు.కాశ్మీరీ పండిట్ ప్రభుత్వ ఉద్యోగులను లోయకు తిరిగి వచ్చేలా బలవంతం చేయవద్దని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. లోయలో పండితుల మనుగడకు పరిస్థితి అనుకూలంగా లేదు. పండిట్ ఉద్యోగులను జమ్మూలో సర్దుబాటు చేయాలి.వారి జీతాలు విడుదల చేయాలని అబ్దుల్లా అన్నారు.
మైనారిటీల ప్రాణాలను కాపాడడంలో బీజేపీ విఫలమైంది..
ఈ సంఘటనలు హర్యానాలో అయినా కాశ్మీర్‌లో అయినా బీజేపీకి మాత్రమే మేలు చేస్తాయి. ఇక్కడ మైనారిటీల ప్రాణాలను కాపాడడంలో బీజేపీ విఫలమైంది. వారు లోయలో సాధారణ స్థితిని చూపించడానికి మాత్రమేమైనారిటీలను ఉపయోగిస్తున్నారని పిడిపి చీఫ్ మెహబూబా ముఫ్తీ ఉగ్రదాడిపై ప్రభుత్వాన్ని నిందించారు.దేశంలోని ముస్లింల ప్రతిష్టను దిగజార్చేందుకు బీజేపీ ఈ తరహా ఘటనలను ఉపయోగిస్తోంది. ఈ చర్యను నేను ఖండిస్తున్నాను. ఇది కాశ్మీరీ ప్రజల ప్రవర్తన కాదు. ఈ చర్యలన్నీ ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.