Last Updated:

Indian Navy : భారత నావికాదళంలో 3,000 మంది అగ్నివీరులు .. నేవీచీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్

భారత నావికాదళంలో దాదాపు 3,000 మంది అగ్నివీరులు చేరుకున్నారని, వారిలో 341 మంది మహిళలు ఉన్నారని నేవీ శనివారం తెలిపింది.

Indian Navy : భారత నావికాదళంలో  3,000 మంది అగ్నివీరులు .. నేవీచీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్

Indian Navy: భారత నావికాదళంలో దాదాపు 3,000 మంది అగ్నివీరులు చేరుకున్నారని, వారిలో 341 మంది మహిళలు ఉన్నారని నేవీ శనివారం తెలిపింది. నావికాదళ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ మాట్లాడుతూ, మహిళా నావికులను తొలిసారిగా చేర్చుకున్నట్లు తెలిపారు. భారత నౌకాదళం 2047 నాటికి ‘ఆత్మనిర్భర్’ (స్వయం సమృద్ధి)గా మారుతుందని ప్రభుత్వానికి హామీ ఇచ్చిందని అడ్మిరల్ కుమార్ తెలిపారు.

“మేము ఇప్పుడు 341 మంది మహిళా అగ్నివీర్‌లను చేర్చుకున్నాము. మహిళలను ర్యాంకుల్లోకి చేర్చడం ఇదే మొదటిసారి. మేము మహిళలను పురుషల మాదిరిగానే పరీక్షలు నిర్వహించి చేర్చుకున్నామని అడ్మిరల్ కుమార్ చెప్పారు, “వారు ఓడలు, ఎయిర్‌బేస్‌లు, ఎయిర్‌క్రాఫ్ట్‌లలో మోహరించబడతారు. సాధారణ నావికుడు శిక్షణ పొందిన విధంగా వారు ప్రతిదానికీ శిక్షణ పొందుతారు. శిక్షణలో ఎటువంటి తేడా ఉండదు.ఇక్కడ మేము వ్యక్తి సామర్థ్యాన్ని మాత్రమే చూస్తామని అన్నారు.

హిందూ మహాసముద్ర ప్రాంతంలో వివిధ చైనా సైనిక మరియు పరిశోధనా నౌకల కదలికలపై నావికాదళం గట్టి నిఘా ఉంచుతుందని అన్నారు. గత ఏడాది కాలంలో భారత నావికాదళం చాలా అధిక కార్యాచరణను సాధించిందన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌పై ప్రభుత్వం మాకు స్పష్టమైన మార్గదర్శకాలను అందించింది. 2047 నాటికి భారత నావికాదళం ఆత్మనిర్భర్‌గా మారుతుందని మేము హామీ ఇచ్చాము” అని చెప్పారు. విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను ప్రారంభించడం భారతదేశానికి ఒక మైలురాయి అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి: