Last Updated:

South Korea plane crash: ఘోర ప్రమాదం.. 179 మంది దుర్మరణం 

South Korea plane crash: ఘోర ప్రమాదం.. 179 మంది దుర్మరణం 

South Korea Plane Crash almost 179 People Feared Dead: సౌత్ కొరియాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 179 మంది మృతి చెందారు. ఎయిర్ పోర్టు గోడను ఢీకొని విమానం పేలింది. ల్యాండింగ్ సమయంలో రన్ వేపై విమానం అదుపు తప్పింది. ఈ ఘటన ముయాన్ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది.

ఈ విమానం బ్యాంకాక్ నుంచి ముయాన్ వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. మొత్తం 181 మందిలో 179 మంది మరణించి ఉంటారని ఆ దేశ అగ్నమాపక శాఖ తెలిపింది. అయితే ఈ ఘటనలో ఇద్దరు మాత్రమే బగికి ఉన్నారని, వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో 33 ఏళ్ల అటెండెంట్, 20 ఏళ్ల మహిళ ఉన్నట్లు పేర్కొన్నారు ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

వివరాల ప్రకారం. సౌత్ కొరియాలోని ముయాన్ విమానాశ్రయంలో రన్ వేపై ల్యాండింగ్ సమయంలో ల్యాండింగ్ గేర్ సమస్యతో విమానం ఫ్లైట్ గోడను బలంగా ఢీకొట్టింది. దీంతో విమానం పేలి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ మంటల ధాటికి 179 మంది చనిపోయారు. బ్యాంకాక్ నుంచి ముయాన్ వస్తుండగా ల్యాండింగ్ సమయంలో పేలింది. ప్రమాద ధాటికి విమాన శకలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఎగసిపడిన మంటలకు ఆకాశంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.

అయితే విమానం ల్యాండింగ్ సమయంలో ల్యాండింగ్ గేర్, టైర్లు పనిచేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందని పలువురు చెబుతున్నారు. దక్షిణా కొరియా ఫైర్ చీఫ్ లీ చెప్పిన వివరా ప్రకారం.. విమానం ఇంజిన్‌ను ఓ పక్షి ఢీకొట్టడంతో పాటు వాతావరణ పరిస్థితుల ప్రభావంతో సమస్య వచ్చినట్లు చెబుతున్నారు. కాగా, దక్షిణ కొరియాలో 1997లో జరిగిన ఓ విమాన ప్రమాదంలో దాదాపు 228 మంది మృతి చెందారు. ఈ ఘటన జరిగిన 27ఏళ్ల తర్వాత అతి పెద్ద ప్రమాదం.