Home / అంతర్జాతీయం
వందలాది మంది పౌరుల మరణానికి దారితీసిన గ్రీస్ పడవ దుర్ఘటన వెనుక మానవ అక్రమ రవాణాదారులను గుర్తించేందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదివారం ఉన్నత స్థాయి దర్యాప్తును ప్రకటించారు. ఇప్పటి వరకు, మానవ అక్రమ రవాణాకు కారణమైన కనీసం 10 మంది సబ్ ఏజెంట్లను పాకిస్తాన్‌లోని అనేక ప్రాంతాల నుండి అరెస్టు చేశారు.
భారత ప్రభుత్వం వాంటెడ్ టెర్రరిస్టు గా ప్రకటించిన కెనడాకు చెందిన ఖలిస్థాన్ అనుకూల నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను బ్రిటిష్ కొలంబియాలోని గురునానక్ సిక్కు గురుద్వారా పార్కింగ్ స్థలంలో ఇద్దరు గుర్తు తెలియని ముష్కరులు కాల్చి చంపారు. అతను గురునానక్ సిక్కు గురుద్వారా అధ్యక్షుడు.
మద్యం మత్తులో స్పృహతప్పిన మహిళపై అత్యాచారం చేసినందుకు ఒక భారతీయ విద్యార్థిని యూకేలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.ప్రీత్ వికల్ (20) అనే వ్యక్తి గత ఏడాది జూన్‌లో మద్యం మత్తులో ఉన్న మహిళను కార్డిఫ్‌లోని తన ఫ్లాట్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడని వారు తెలిపారు.
అక్రమ వలసలపై దేశవ్యాప్తంగా అణిచివేతలో భాగంగా బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునక్ యూకే హోమ్ ఆఫీస్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో కలిసి 20 దేశాలకు చెందిన 105 మంది విదేశీ పౌరులను అరెస్టు చేయడంలో పాల్గొన్నారు.
: లండన్‌లో 38 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన వ్యక్తి కత్తిపోట్లకు గురై మరణించాడు. జూన్ 16న అరవింద్ శశికుమార్ క్యాంబర్‌వెల్‌లోని సౌతాంప్టన్ వేలో 1.31 గంటలకు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
America Cat Job: ఈ పోటీ ప్రపంచంలో ఓ ఉద్యోగం రావాలంటే నానా తిప్పలు పడాల్సి వస్తుంది. అలాంటిది మనుషులకే ఉద్యోగాలు లేక చస్తున్న రోజుల్లో పెంపుడు జంతువులు ఈజీగా ఉద్యోగాలు చేస్తున్నాయి. జంతువులు ఉద్యోగం చెయ్యడం ఏంటా అని ఆలోచిస్తున్నారు కదా.. మీరు విన్నది నిజమేనండి.
బ్రిటన్‌లో ఖలీస్తానీ లిబరేషన్ ఫోర్స్ చీఫ్ అవతార్ సింగ్ ఖాందా అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఖలీస్తానీ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్‌కి గురువుగా చెప్పుకునే అవతార్ సింగ్ క్యాన్సర్‌తో కన్నుమూశాడని ప్రకటించినప్పటికీ.. అతనిపై విష ప్రయోగం జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తు కొనసాగుతోంది.
: జనాభా సంక్షోభాన్ని నివారించడానికి చైనా రాజధాని బీజింగ్ పునరుత్పత్తి సేవలకు వైద్య బీమా కవరేజీని విస్తరించాలని నిర్ణయించింది.జూలై 1 నుండి, స్పెర్మ్ ఆప్టిమైజేషన్ నుండి ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ వరకు సేవలు 16 రకాల వైద్య సదుపాయాలు రీయింబర్స్ చేయబడతాయి
ఆస్ట్రేలియా చట్టసభ సభ్యురాలు లిడియా థోర్ప్ తాను పార్లమెంటులో లైంగిక వేధింపులకు గురయ్యానని మహిళలు పని చేయడానికి పార్లమెంట్హ భవనం సురక్షితమైన స్థలం కాదని పేర్కొన్నారు. తోటి సెనేటర్ తనపై అసభ్యకరమైన పదజాలాన్ని ప్రయోగించాడని తనను అనుచితంగా తాకాడని కన్నీళ్లతో సెనేట్ లో చెప్పారు. అతను చాలా శక్తివంతమైన మనిషని కూడా తెలిపారు.
దుఃఖంపై పుస్తకాన్ని వ్రాసి తన భర్తను హత్య చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న అమెరికా మహిళ కౌరీ రిచిన్స్, అమెరికాలో ధనవంతుల కోసం లగ్జరీ జైళ్ల గురించి గూగుల్ లో సెర్చ్ చేసినట్లు తెలిసింది. కోర్టులో సోమవారం విచారణ సందర్భంగా రిచిన్స్ యొక్క గూగుల్ శోధనలు వెల్లడయ్యాయి