Last Updated:

Israeli Woman Rachel Edri: హమాస్ మిలిటెంట్లకు టీ, కుకీలు ఇచ్చి ఏమార్చిన ఇజ్రాయెల్ మహిళ రచేల్ ఇద్రి

ఇజ్రాయెల్ పౌరులపై దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు దొరికిన వారిని దొరికనట్లు కాల్చి చంపే సమయంలో ఒక మహిళ సమయస్పూర్తితో తాను, తన భర్త ప్రాణాలను కాపాడుకున్న వైనం ఇపుడు సంచలనంగా మారింది

Israeli Woman Rachel Edri: హమాస్ మిలిటెంట్లకు టీ, కుకీలు ఇచ్చి  ఏమార్చిన ఇజ్రాయెల్ మహిళ రచేల్  ఇద్రి

Israeli Woman Rachel Edri:ఇజ్రాయెల్ పౌరులపై దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు దొరికిన వారిని దొరికనట్లు కాల్చి చంపే సమయంలో ఒక మహిళ సమయస్పూర్తితో తాను, తన భర్త ప్రాణాలను కాపాడుకున్న వైనం ఇపుడు సంచలనంగా మారింది. రచేల్ ఇద్రి అనే ఈ మహిళ హమాస్ మిలిటెంట్లకు టీ మరియు కుకీలను ఇచ్చి తమను కాపాడేందుకు పోలీసులు వచ్చేవరకూ వారిని ఏమార్చింది. దీనికి సంబంధించిన వివరాలను రచేల్ మీడియాకు వెల్లడించింది.

20 గంటలపాటు ఉగ్రవాదులతో..(Israeli Woman Rachel Edri)

అక్టోబర్ 7 వ తేదీన హమాస్ మిలిటెంట్లు తుపాకులు మరియు గ్రెనేడ్లుతో రచేల్ ఇంట్లోకి ప్రవేశించి ఆమెను, భర్త డేవిడ్ ను బందీలుగా చేసారు. అయితే ఆమ దైర్యం కోల్పోలేదు.వారితో మామాలూగా వ్యవహరించింది. పోలీసులు వచ్చే వరకూ సమారుగా 20 గంటలపాటు మిలిటెంట్లు వారి ఇంట్లోనే ఉండటం గమనార్హం. మిలిటెంట్లలో ఒకరు తన తుపాకీ బట్‌తో ఆమె ముఖం మీద కొట్టాడు, కానీ ఆమె భయపడలేదు.మిలిటెంట్లకు క్యాన్డ్ పైనాపిల్, టీ మరియు కుకీలను అందించింది. ఆమె వారికి అరబిక్ పాటలు పాడింది. వారు హిబ్రూ పాటలు పాడారు. ఈ సందర్బంగా ఒక మిలిటెంట్ నువ్వు నాకు తల్లిని గుర్తు చేసావని చెప్పగా నేను నీకు తల్లిలాంటి దాన్ననే జవాబిచ్చారు. ఈ రకంగా సంభాషణలు సాగడంతో వారు తాము ఉగ్రవాదులమనే విషయాన్ని కూడా మర్చిపోయారని రచేల్ చెప్పారు. ఈ విధంగా సుమారుగా 20 గంటలు గడిచిన తరువాత స్దానిక పోలీసులు ఇంటని సమీపించారు. పోలీసు డిపార్టుమెంట్లో పనిచేస్తున్న రచేల్ కుమారుడు ఎవియాటర్ కూడా వారితో ఉన్నాడు. చివరకు వారు మిలిటెంట్లను హతమార్చి రచేల్ దంపతులను రక్షించారు.

మిలిటెంట్లను ఏమార్చిన రచేల్ పై ఇపుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ బుధవారం ఇజ్రాయెల్ పర్యటించినపుడు కొంతమంది పౌరులు అతడిని కలిసారు. వారిలో రచేల్ కూడా ఉన్నారు. ఈ సందర్బంగా ఆమె సమయస్పూర్తిని కొనియాడిన బైడెన్ అప్యాయంగా అలింగనం చేసుకున్నారు.