Last Updated:

Skipping Benefits: స్కిప్పింగ్ తో అనారోగ్యాన్ని స్కిప్ చేసేయండిలా..

Skipping Benefits: స్కిప్పింగ్ తో అనారోగ్యాన్ని స్కిప్ చేసేయండిలా..

Skipping Benefits: వర్కవుట్స్ చేయడంలో ఎవరి దారి వారిది. కొందరు యోగా చేస్తారు.. కొందరు జిమ్ లో కుస్తీలు పడుతుంటారు.

ఇంకొందరు వ్యాయామాలు చేయడానికి టైం లేదంటూ డైట్ ఫాలో అవుతుంటారు. అయితే వర్క్ అవుట్స్ చేయకపోతే ప్రస్తుత కాలంలో లేనిపోని సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది.

అందుకే చిన్నవైనా సరే రోజూ ఏదో ఒక వ్యాయామం చేయడం మంచిదంటున్నారు ఫిట్ నెస్ నిపుణులు.

అలాంటి వ్యాయామాల్లో స్కిప్పింగ్ ఒకటి. అదేనండీ తాడాట. చిన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఈ తాడాట ఆడి ఉంటారు.

ఇపుడదే తాడాటతో ఎన్నో వ్యాయామాలు చేయొచ్చు. మరి స్కిప్పింగ్ తో అటు శారీరకంగా, ఇటు మానసికంగా కలిగే ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం.

ప్రతిరోజూ గంట స్కిప్పింగ్ తో

ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం మీరు చేసే వ్యాయామంలో స్కిప్పింగ్‌ను కూడా భాగం చేసుకోండి.

తాటాట వల్ల చక్కటి ఆరోగ్యంతో పాటు శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వు క్రమంగా కరిగి నాజూగ్గా తయారయ్యే అవకాశం ఉంటుంది.

ప్రతిరోజూ గంటపాటు స్కిప్పింగ్ చేస్తే 1300 క్యాలరీలు ఖర్చవుతాయి.

స్కిప్పింగ్ తో భుజాలు తిప్పడం, పాదాలతో ఎగరడం వంటి వాటి వల్ల ఆయా భాగాలు స్ట్రాంగ్ గా, ఫ్లెక్సిబుల్ గా తయారవడంతో పాటు మిగతా శరీర భాగాల్లో కూడా కదలికలు ఏర్పడతాయి.

ఫలితంగా శరీర భాగాలన్నీ సులభంగా వంగేలా తయారవుతాయి. ఓ పది నిమిషాల పాటు స్కిప్పింగ్‌ చేయడం వల్ల ఒక మైలు పరిగెత్తడంతో సమానమని నిపుణుల అభిప్రాయం.

శ్వాస, రక్త ప్రసరణ వ్యవస్థల పనితీరు అధికంగా మెరుగుపడుతుంది. అయితే ఇన్ని లాభాలు ఉన్న ఈ తాడాట అడే సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.

స్కిప్పింగ్ తో శరీరంలో ఎముకలు దృఢమవుతాయి. ఫలితంగా ఆస్టియోపొరోసిస్‌ సమస్యను అరికట్టే అవకాశం ఉంటుంది.

అలాగే శరీరంపై ఉండే ముడతలు కూడా తొలగిపోయే ఛాన్స్ కూడా ఉంది.

స్కిప్పింగ్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్కిప్పింగ్ చేసినపుడు గుండె కొట్టుకోవడం పెరుగుతుంది. దానివల్ల గుండె ఫిట్ గా ఆరోగ్యంగా ఉంటుంది.

అంతేకాకుండా ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

స్కిప్పింగ్ తో మెదడుపై అనుకూల ప్రభావాన్ని చూపెడుతుంది. ఎందుకంటే జాగ్రత్తగా జంప్ చేసేలా మెదడు సిగ్నల్ పంపిస్తుంది.

స్కిప్పింగ్ చేసే మొదట్లో బాగా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. కానీ రోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరం హుషారుగా మారుతుంది.

ఇది మీ అలసటను పోగొట్టడమే కాకుండా రీఫ్రెష్ గా ఉంచుతుంది. కాబట్టి బద్ధకంగా, ఎప్పుడూ విసుగ్గా ఉండేవారు స్కిప్పింగ్ ను రోజూ చేయడం మంచిది.

ఈ రోజుల్లో ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక ఆరోగ్య సమస్యలు ఎక్కువ అయ్యాయి. ఈ సమస్యల నుంచి రిలీఫ్ పొందేందుకు స్కిప్పింగ్ బాగా ఉపయోగపడుతుంది.

మానసిక స్థితిని మెరుగుపరిచే ఎండార్ఫిన్ల ఉత్పత్తిని పెంచేందుకు సహాయపడుతుంది.

స్కిప్పింగ్ చేసిన వెంటనే దాహం వేస్తుందని నీరు తాగడం, ఏదైనా తినడం లాంటివి చేయకూడదు.

అరగంట తర్వాత మొతకెత్తిన గింజలు, పండ్లు.. వంటి తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిది.

స్కిప్పింగ్ లో జాగ్రత్తలు అవసరం

తాడాట ఆడేటప్పుడు ఖచ్చితంగా షూస్ వేసుకోవాలి. లేదంటే పాదాల పగుళ్లు ఏర్పడతాయి. మట్టినేల మీద మందపాటి కార్పెట్ మీద మాత్రమే స్కిప్పింగ్ ఆడాలి. గుండె సమస్యలు, మోకాళ్ల నొప్పులు ఉన్నవారు ఫిట్ నెస్ నిపుణుల సలహా తీసుకుని ఆడాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉండగలరు.

గుండె సమస్యలు, అధిక రక్తపోటుతో బాధపడే వారు స్కిప్పింగ్ కు చేయకపోవడం ఉత్తమం

అలాగే మహిళలు డెలివరీ కోసం లేదా ఏ ఇతర కారణాలతో నైనా ఆపరేషన్ చేయించుకుంటే వెంటనే ఈ వ్యాయామం చేయడం అసులు మంచిది కాదు. డాక్టర్ సలహాతో చికిత్స అనంతరం కొన్ని నెలల తర్వాత స్కిప్పింగ్ ప్రారంభించవచ్చు.

స్కిప్పింగ్ కోసం వాడే తాడు కూడా సరిగా ఉందో లేదో చూసుకోవాలి. లేదంటే భుజాలు నొప్పులు వస్తాయి. కాబట్టి ఎత్తుకు సరిపోయే తాడును ఎంచుకోవాలి.

త్వరగా బరువు తగ్గాలనుకుని స్పీడుగా స్కిప్పింగ్ చేయడం కూడా మంచిది కాదు. దీని వల్ల బీపీ, గుండె వేగం అమాంతం పెరుగుతాయి.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/