Last Updated:

Moong Dal Sprouts: మొలకెత్తిన పెసర్లతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా

Moong Dal Sprouts: కాలానుగుణంగా ఆహారంలో అనేక మార్పులు వచ్చాయి. అల్పాహారం మొదలకుని లంచ్ డిన్నర్ వరకూ వెరైటీ ఆహారాలు మన డైలీ రొటీన్లో భాగమయ్యాయి, మొలకెత్తిన పెసరగింజలను దేశీయంగా చాలా మంది అల్పాహారంగా తీసుకుంటున్నారు.

Moong Dal Sprouts: మొలకెత్తిన పెసర్లతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా

Moong Dal Sprouts: కాలానుగుణంగా ఆహారంలో అనేక మార్పులు వచ్చాయి. అల్పాహారం మొదలకుని లంచ్ డిన్నర్ వరకూ వెరైటీ ఆహారాలు మన డైలీ రొటీన్లో భాగమయ్యాయి, మొలకెత్తిన పెసరగింజలను దేశీయంగా చాలా మంది అల్పాహారంగా తీసుకుంటున్నారు. మరి వీటిని రోజూ ఆహారంగా తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం. మొలకెత్తిన పెసర్లలో ఫైబర్ మాత్రమే కాకుండా, ఫోలేట్, విటమిన్ సి వంటి అనేక ఖనిజాలు కూడా ఉంటాయి.

మొలకెత్తిన మూంగ్లో విటమిన్ కె ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అనేక విధాలుగా తోడ్పడుతుంది. 1 కప్పు పెరసపప్పులో 5.45 mcg విటమిన్ K ఉంటుంది. కండరాల బలాన్ని పెంచడానికే కాకుండా, కె విటమిన్ రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది కాకుండా, ఆస్టియోకాల్సిన్ అనేది ఆరోగ్యకరమైన ఎముక కణజాలాన్ని ఉత్పత్తి చేయడానికి ఎంతో సహాయపడుతుంది.

1. గుండెకు మేలు చేస్తుంది: మొలకెత్తిన పెసర గింజలు గుండె ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

2. పొట్ట ఆరోగ్యానికి మంచిది: మొలకెత్తిన పెసర గింజలను జీర్ణాశయ గట్‌లోని బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది. కడుపులో జీవక్రియ కార్యకలాపాలను పెంచుతుంది. ఫలితంగా, మలబద్ధకం ఉండదు. రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంచుతుంది.

3. ఎముకల బలాన్ని పెంచుతుంది: మొలకెత్తిన పెసర గింజలను తీసుకోవడం వల్ల ఎముకలు పటిష్టంగా ఉంటాయి. ఎముకల సాంద్రత పెరగడంతో పాటు కీళ్లకు సంబంధించిన సమస్యలను నివారిస్తుంది. అంతే కాదు, కండరాలు ఆరోగ్యంగా ఉండేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది.

4. అధిక బరువు నియంత్రణకు: అధిక బరువుతో బాధపడేవారు సులభంగా బరువు తగ్గాలంటే ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు బదులుగా పెసర మొలకలను తీసుకుంటే సరిపోతుంది. దీనిలో ఉండే ప్రోటీన్లు బరువు తగ్గటంలో సహాయపడతాయి.

5. మహిళలకు మంచి మేలు: పెసర మొలకలు తినటం వల్ల ముఖ్యంగా మహిళ ఆరోగ్యానికి మంచి మేలు జరుగుతుంది. కణజాలం, కణాల పెరుగుదల, హార్మోన్ల సమతుల్యత, నరాల పనితీరు, పునరుత్పత్తికి అవసరమయ్యే విటమిన్ బి9 ను మొలకల ద్వారా అందుతుంది. గర్భధారణ సమయంలో ఫోలేట్ తీసుకోవడం వల్ల నెలలు నిండకుండానే ప్రసవాన్ని నివారించవచ్చు. మొలకెత్తిన పెసర్లలో 36 శాతం మెగ్నీషియం కంటెంట్‌ను ఉంటుంది. దాని ద్వారా మెగ్నీషియం లోపాన్ని సరిచేయవద్దు.