Last Updated:

Veekshanam: సినిమా ప్రీ క్లైమాక్స్ ఎవ్వరూ ఎక్స్‌పెక్ట్ చేయలేరు – యంగ్ హీరో రామ్ కార్తీక్

Veekshanam: సినిమా ప్రీ క్లైమాక్స్ ఎవ్వరూ ఎక్స్‌పెక్ట్ చేయలేరు – యంగ్ హీరో రామ్ కార్తీక్

Veekshanam: రామ్ కార్తీక్, క‌శ్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “వీక్షణం”. ఈ సినిమాని కామెడీ మిస్టరీ థ్రిల్లర్‌గా దర్శకుడు మ‌నోజ్ ప‌ల్లేటి తెరకెక్కిస్తున్నారు. ప‌ద్మ‌నాభ సినీ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “వీక్షణం” ఈ నెల 18న గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు యంగ్ హీరో రామ్ కార్తీక్.

నేను లాస్ట్ ఇయర్ ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ అనే మూవీ చేశాను. అది ఆహా ఓటీటీలో రిలీజైంది. ఆ టైమ్ లోనే డైరెక్టర్ మనోజ్ పల్లేటి “వీక్షణం” మూవీ స్క్రిప్ట్ చెప్పారు. వినగానే ఆసక్తికరంగా అనిపించింది. నేను ఇప్పటిదాకా విన్న కథలో డిఫరెంట్ ఫీల్ కలిగించింది. మనం కథలు వినేప్పుడు నెక్స్ట్ ఇలా జరుగుతుంది అనుకుంటాం. కానీ “వీక్షణం” కథ విన్నప్పుడు అలా గెస్ చేయలేకపోయాను. ప్రీ క్లైమాక్స్ తో పాటు మరికొన్ని హుక్ సీన్స్ ఉంటాయి. అవి చాలా బాగుంటాయి. వాటి గురించి రివీల్ చేయలేను.

“వీక్షణం” సినిమాలో సరదాగా ఉండే కుర్రాడిలా కనిపిస్తా. అతనికి పక్కవాడి జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. తనకున్న ఈ మనస్తత్వం వల్ల అతను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేది మూవీలో మెయిన్ పాయింట్. ఈ యువకుడి జీవితంలోకి ఓ అమ్మాయి రావడం అతని కథ అనేక మలుపులు తిరగడం సినిమాలో చూస్తారు. హీరో క్యారెక్టర్ సరదా నుంచి క్రమంగా సీరియస్ నెస్ వైపు మళ్లుతుంది. సరదాగా ఉండే ఆ యువకుడు.. డిటెక్టివ్ లా మారి తన చుట్టూ జరుగుతున్న విషయాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటాడు.

“వీక్షణం” సినిమా లవ్ స్టోరీతో స్టార్ట్ అయ్యి మిస్టరీ థ్రిల్లర్ గా మారుతుంది. నేను గతంలో థ్రిల్లర్స్ చేశాను గానీ మిస్టరీ థ్రిల్లర్ మూవీలో నటించడం ఇదే తొలిసారి. ప్రతి సినిమాకు ఏదో కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటాం. నేను నా గత మూవీస్ తో చూస్తే ఇందులో మెచ్యూర్డ్ గా , సెటిల్డ్ గా పర్ ఫార్మ్ చేశాననే అంటున్నారు. మూవీ చూసిన సురేష్ కొండేటి గారు ఇదే కాంప్లిమెంట్ ఇచ్చారు. నేను ఈ సినిమాలో చాలా సెటిల్డ్ గా నటించానని ఆయన అన్నారు. అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ గా భావిస్తా.

“వీక్షణం” సినిమా డైరెక్టర్ మనోజ్ కొత్త వారు కాబట్టి ప్రాజెక్ట్ సెట్ చేసేందుకు మొదట్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. మా ప్రొడ్యూసర్ అశోక్ గారు మనోజ్ ఒకే ఊరివారు కావడంతో కథ నచ్చి వెంటనే మూవీ స్టార్ట్ చేశారు. అందుకు ప్రొడ్యూసర్ అశోక్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా.

థ్రిల్లర్ మూవీస్ అంటే మైండ్ గేమ్. ప్రేక్షకుల్ని చివరి దాకా ఎంగేజ్ చేయగలిగితేనే ఆ సినిమా సక్సెస్ అవుతుంది. అందుకే మా డైరెక్టర్ మనోజ్ స్క్రిప్ట్ పలు వెర్షన్స్ రాసుకున్నారు. స్క్రీన్ ప్లేలో హుక్ పాయింట్స్ ఉండేలా చూసుకున్నారు. మా మూవీలో ప్రీ క్లైమాక్స్ ను ఎవరూ ఊహించలేరు. మా మూవీలో హీరో మరొకర్ని అబ్జర్వ్ చేస్తుంటాడు. కానీ అతనికి తెలియకుండా మరో కన్ను ఆయన్ను చూస్తుంటుంది. అందుకే వీక్షణం అనే టైటిల్ పెట్టాం. కథకు చాలా యాప్ట్ టైటిల్ ఇది.

మా “వీక్షణం” మూవీలో భయపెడుతూనే దాన్ని ఎలా అధిగమించాలో చూపెడుతుంది. మా మూవీకి బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు డీవోపీ సాయి రామ్, సమర్థ్ మంచి మ్యూజిక్ చేశారు. డిఫరెంట్ టైప్స్ సాంగ్స్ చేశారు.

2016లో దృశ్యకావ్యం సినిమా నుంచి నేను కెరీర్ కొనసాగిస్తున్నాను. మీ అందరి సపోర్ట్ తో హీరోగా మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. దామోదర ప్రసాద్ గారి నిర్మాణంలో ఎఫ్ యూసీకే అనే మూవీ చేశాను. పెద్ద ప్రొడక్షన్ హౌస్ నిర్మించింది. అయితే కోవిడ్ టైమ్ కాబట్టి ప్రేక్షకులు థియేటర్స్ కు రాలేదు. తెలిసినవాళ్లు, గ్రేట్ ఇండియన్ సూసైడ్ మూవీస్ నాకు మంచి పేరు తెచ్చాయి. “వీక్షణం” కూడా హీరోగా నన్ను మరో మెట్టు పైకి తీసుకెళ్తుందని ఆశిస్తున్నా. వాసు గారి డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాను. పోస్ట్ ప్రొడక్షన్ లో ఆ సినిమా ఉంది. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లైనప్ లో ఉన్నాయి.