Last Updated:

Gruhalakshmi: అక్టోబర్ 20 ఎపిసోడ్ లో మొత్తానికి సొంత ఇంట్లోకి అడుగుపెట్టిన తులసి

ఇక తులసి, ఈ ఇల్లు నా పేరు మీద వద్దు మామయ్యా. ఒకసారి కలిసిరాలేదు. ఇప్పుడు మీ పేరు మీదనే ఉంచండి అని అంటుంది. ఆ మాటతో పరందామయ్య, ‘ఈ ఇల్లు నీకు నేను ఇస్తున్న బహుమతి. వద్దన్నావంటే, మన మధ్య ఉన్న బంధాన్ని అవమానించినట్టే’ అని అంటాడు పరందామయ్య.

Gruhalakshmi: అక్టోబర్ 20 ఎపిసోడ్ లో మొత్తానికి సొంత ఇంట్లోకి అడుగుపెట్టిన తులసి

Gruhalakshmi Today: నేటి గృహలక్ష్మీ ఎపిసోడ్ లో ఈ రెండు సీనులు హైలెట్. ఇది నీ ఇల్లే తులసి, నువ్ పోగొట్టుకున్న ఇల్లు మళ్లీ నీ సొంతం అయ్యిందని అంటాడు. ఆ మాటతో తులసి ‘జీవితంలో మొదటి సారి నేను పొగొట్టుకున్నది నాకు దొరికింది. దేవుడు ఇలాంటి వరాలు కూడా ఇస్తాడా, నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఇదంతా ఒక కలలా ఉంది’ అని చాలా ఎమోషనల్ అవుతుంది తులసి. నువ్వు దూరం చేసుకున్న ఇంటిని నీకు దగ్గర చేయాలని కల కన్నానమ్మా. కానీ ఆ కలను ఎలా నిజం చేయాలో తెలియలేదు. అలాగే చాలా కాలంగా బాధపడుతున్నాను. నా వల్ల కాదనే అనుకున్నాను. కానీ చివరికి సాధ్యం అయ్యింది అని సంతోషంగా చెబుతాడు పరందామయ్య. ఇంతలో అనసూయ, ఇదంతా బాగానే ఉంది కానీ, ఇంత పెద్ద ఇంటిని తిరిగి కొనడం అంటే అది మామూలు విషయం కాదు. ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎక్కడిది? ఎవరు ఇచ్చారని ? గట్టిగా అడుగుతుంది.

నేనే అడుగుదాం అనుకున్న మామయ్యా. ఇంత డబ్బు ఇప్పటికిప్పుడు ఎక్కడిది అని అడుగుతుంది తులసి. అంతా ఆ దేవుడి దయ. అలా కలిసి వచ్చింది. అమ్మా, చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు నేనే తప్పకుండా చెప్తానని పరందామయ్య అని అంటాడు. ఇక తులసి, ఈ ఇల్లు నా పేరు మీద వద్దు మామయ్యా. ఒకసారి కలిసిరాలేదు. ఇప్పుడు మీ పేరు మీదనే ఉంచండి అని అంటుంది. ఆ మాటతో పరందామయ్య, ‘ఈ ఇల్లు నీకు నేను ఇస్తున్న బహుమతి. వద్దన్నావంటే, మన మధ్య ఉన్న బంధాన్ని అవమానించినట్టే’ అని అంటాడు పరందామయ్య.