Last Updated:

Producer VA Durai : ప్రముఖ నిర్మాత వీఏ దురై మృతి.. రజినీ, సూర్య, విక్రమ్ లతో సినిమాలు

ఇటీవల సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తమిళ పరిశ్రమలో ఇటీవలే హీరో విజయ్ ఆంటోనీ కూతురు ఆత్మహత్యని మరిచిపోకముందే తాజాగా ఓ నిర్మాత కన్నుమూశారు. కాగా నిర్మాత వీఏ దురై ఈ లోకాన్ని విడిచారు. గత కొంత కాలంగా  అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన వయస్సు 59 సంవత్సరాలు.

Producer VA Durai : ప్రముఖ నిర్మాత వీఏ దురై మృతి.. రజినీ, సూర్య, విక్రమ్ లతో సినిమాలు

Producer VA Durai : ఇటీవల సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తమిళ పరిశ్రమలో ఇటీవలే హీరో విజయ్ ఆంటోనీ కూతురు ఆత్మహత్యని మరిచిపోకముందే తాజాగా ఓ నిర్మాత కన్నుమూశారు. కాగా నిర్మాత వీఏ దురై ఈ లోకాన్ని విడిచారు. గత కొంత కాలంగా  అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన వయస్సు 59 సంవత్సరాలు. ఇటీవల కొన్ని నెలల క్రితం తనని ఆర్ధికంగా ఆదుకోవాలని, కష్టాల్లో ఉన్నాను అని ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు.

అప్పట్లో ఈ వీడియో వైరల్ అవ్వగా పలువురు తమిళ ప్రముఖులు సహాయం చేశారు. ఇక ఈ క్రమంలోనే ఇంట్లోనే చికిత్స పొందుతూ నేడు తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. తమిల్ లో సేతు, రజినీ కాంత్ తో  బాబా, సూర్య – విక్రమ్ కలిసి నటించిన శివపుత్రుడు, గజేంద్ర.. లాంటి పలు సూపర్ హిట్ సినిమాలని నిర్మించారు. గజేంద్ర సినిమా తర్వాత ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు . వీఏ దురై మరణంతో తమిళ పరిశ్రమలో విషాదం నెలకొనగా పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.