Mad Square OTT: మ్యాడ్ స్క్వేర్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది – స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే, ఎక్కడో తెలుసా?

Mad Square OTT Release Date: నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌లు ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’ ఓటీటీ రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేసుకుంది. మార్చి 28న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. గతంలో విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన మ్యాడ్ మూవీకి సీక్వెల్‌గా తీసుకువచ్చారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.
థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యింది. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది. ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ని వెల్లడిస్తూ సదరు సంస్థ ప్రకటన ఇచ్చింది. ఈ నెల 25న (ఏప్రిల్ 25) నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ అందుబాటులోకి రానుందని నెట్‌ఫ్లిక్స్ స్పష్టం చేసింది. మరి ఇంకేందుకు ఆలస్యం థియేటర్లలో మిస్ అయిన వారు మ్యాడ్ స్క్వేర్‌ను ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
The boys are back with double the MADness!
Watch Mad Square on Netflix, out 25 April in Telugu, Hindi, Tamil, Kannada and Malayalam.#MadSquareOnNetflix pic.twitter.com/0WGsRj2Sgc— Netflix India South (@Netflix_INSouth) April 21, 2025