Senthil Kumar: నువ్వు లేకుండానే ఏడాది గడిచింది – కన్నీరు పెట్టిస్తున్న సెంథిల్ పోస్ట్!

Senthil Kumar Gets Emotional: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. తన భార్య రూహిని తలుచుకుంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. గతేడాది ఆయన భార్య రూహి మరణించిన సంగతి తెలిసిందే. ఆమె చనిపోయి ఏడాది అవుతుంది. ఈ క్రమంలో ఆమె గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు.
నువ్వు లేకుండానే ఏడాది..
భార్య రూహితో దిగిన ఫోటో షేర్ చేస్తూ.. “నువ్వు లేకుండ ఏడాది గడిచిపోయింది నీ చిరునవ్వు, నీ ప్రేమ లేకుండా 365 రోజులు గడిచిపోయాయి. ఈ ఏడాదంతా నీ జ్ఞాపకాలు, కన్నీళ్లతోనే నువ్వు నాలో సజీవంగా ఉన్నావు. ఎప్పుడూ నాకు గుర్తోచ్చే విషయం ఏంటో తెలుసా? నన్ను చూసినప్పుడల్లా నువ్వు చిందించే చిరునవ్వు. నువ్వు నవ్వినప్పుడు నీ కళ్ళలో కనిపించే మెరుపు, నా చేతిలో నువ్వు చేయేసే విధానం. పదేపదే గుర్తొస్తాయి.
నువ్వే నా సర్వస్వం..
నువ్వే నా శిల, నా ఛాంపియన్, నా బెస్ట్ ఫ్రెండ్, నా సర్వస్వం నువ్వే! నువ్వు పంచిన ప్రేమ, మనం కలిసి చేసిన సాహసాలు.. అన్నింటిని నా జీవితాంత గుర్తుంచుకుంటాను. రెస్ట్ ఇన్ పీస్ మై డార్లింగ్. నువ్వు ఎప్పుడూ నాతోనే ఉంటావు. ఎల్లప్పుడూ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రతి ఒక్కరిని హత్తుకుంటోంది. దూరమైన భార్య తలుచుకుని తన ఆవేదనంతా ఈ పోస్ట్ ద్వారా తెలియజేశాడు. అయితే తన పోస్ట్ కామెంట్స్‌ని డిసెబుల్ చేశాడు.
View this post on Instagram
కాగా సినిమాటోగ్రాఫర్ సెంథిల్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు. అతడు ఎక్కువగా రాజమౌళి సినిమాలకే వర్క్ చేశాడు. రాజమౌళికి కూడా సెంథిల్ అంటే అభిమానం. తనని అర్థం చేసుకుని ఏ షాట్ ఎలా రావాలనే తను అనుకున్నది అనుకున్నట్టు తీసే ఒక్కగానోక్క సినిమాటోగ్రాఫర్ సెంథిల్ అని, అందుకు తన సినిమాలకు సెంథిలే సినిమాటోగ్రాఫర్ వర్క్ చేస్తాడని చెబుతుంటారు. అయితే అలా ఆయన మగధీర సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తుండగా.. సెంథిల్, రూహిలు ప్రేమలో పడ్డారు. 2009లో పెళ్లి చేసుకున్నారు. రూహి.. యోగా టీజర్. అనుష్క, ప్రభాస్, ఇలియానా వంటి ఎంతోమందికి ఆమె యోగా శిక్షణ ఇచ్చారు. 2024 ఫిబ్రవరి 15న రూహి అనారోగ్యంతో మరణించారు.