Last Updated:

Veera Dheera Sooran: చిక్కుల్లో విక్రమ్‌ సినిమా – రిలీజ్‌కి చివరి నిమిషంలో వాయిదా పడ్డ ‘వీర ధీర శూరన్‌ 2’

Veera Dheera Sooran: చిక్కుల్లో విక్రమ్‌ సినిమా – రిలీజ్‌కి చివరి నిమిషంలో వాయిదా పడ్డ ‘వీర ధీర శూరన్‌ 2’

Veera Dheera Sooran Movie Facing Legal Issues: కోలీవుడ్‌ స్టార్‌ హీరో చియాన్‌ విక్రమ్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ ‘వీర ధీర శూరన్‌ 2’ సినిమా చిక్కుల్లో పడింది. గురువారం (మార్చి 27) థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ సినిమా చివరి నిమిషంలో షోస్‌ రద్దయ్యాయి. పీవీఆర్‌, సినీపోల్స్‌ వంటి మల్టీప్లెక్స్‌లో ‘వీర ధీర శూరన్‌’ మార్కింగ్‌ షోలు అనూహ్యంగా రద్దయ్యాయి. దీంతో అభిమానులంతా నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

టికెట్స్‌ బుక్‌ చేసుకుని మార్కింగ్‌ షో చూడాలనుకున్న అభిమానులకు షో క్యాన్సిల్‌ అవ్వడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. అనివార్య కారణాల వల్ల షో క్యాన్సిల్‌ కావడంతో ఆయా థియేటర్‌ యాజమన్యాలు డబ్బులు తిరిగి ఇచ్చేస్తామంటూ సందేశాలు పంపిస్తున్నారు. అంతేకాదు యూఎస్‌ ప్రీమియర్లకు కూడా అంతరాయం ఏర్పడినట్టు సమాచారం. దీనికి కారణం ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ విషయంలో న్యాయపరమైన చిక్కలు ఎదుర్కొంటోందని తెలుస్తోంది.

విక్రమ్‌ హీరోగా ఎస్‌జే సూర్య, దుషారా విజయన్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ‘వీర శూర ధీరన్‌ 2’ తమిళంతో పాటు తెలుగులో గురువారం విడుదలకు సిద్ధమైంది. ఇక సినిమా రిలీజ్‌కు అంతా సిద్దమైంది. ఆడియన్స్‌ టికెట్స్‌ కూడా బుక్‌ చేసుకున్నారు. తీరా షో మొదలయ్యే చివరి నిమిషంలో పలు మల్టీప్లెక్స్‌ థియేటరల్లో షోలను రద్దు చేశారు. ముంబైకి చెందిన ప్రముఖ సంస్థ ఈ సినిమా విషయమై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

సినిమా థియేట్రికల్‌ రిలీజ్‌కు ముందే ఓటీటీ హక్కులను తమకు అమ్ముతామంటూ ఇచ్చిన ఒప్పందాన్ని నిర్మాతలు పక్కన పెట్టినట్టు సదరు సంస్థ ఆరోపించింది. దీంతో సినిమా రిలీజ్‌ని కొన్ని గంటల పాటు నిలిపివేయాలని కోరింది. తాజాగా ఈ పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు ఈ మూవీపై నాలుగు వారాలు స్టే విధించినట్టు తెలుస్తోంది. దీంతో వీర ధీర శూర మూవీ విడుదల కష్టాల్లో పడింది. మరి దీనిపై నిర్మాతలు ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి.