Home / Chiyaan Vikram
తమిళ స్టార్ దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన హిస్టారికల్ మూవీ పొన్నియిన్ సెల్వన్. ఈ సినిమాలో తారాగణం విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. సెప్టెంబర్ 30వ తేదిన ప్యాన్ ఇండియా మూవీగా విడుదలైంది.
విక్రమ్ ఈ స్టార్ హీరోకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. విభిన్న కథల ఎంపికతో, తన నటనాశైలితో యావత్ దేశవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న ఈ ప్రముఖ హీరో ఇప్పుడు మరో సరికొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీకి సంబంధించి దీపావళి సందర్భంగా వీడియో గ్లింప్స్ నెట్టింట సందడి చేస్తోంది.
దర్శకుడు మణిరత్నం గత కొన్నేళ్లుగా ఫామ్ కోల్పోయాడు. అయితే అతని తాజా చిత్రం పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 తో అతను మరలా రికార్డులు తిరగరాయాలని భావిస్తున్నాడు. ఈ చిత్రం ట్రైలర్ ను ఈ రోజు కమల్ హాసన్ మరియు రజనీకాంత్ ప్రారంభించారు.
విక్రమ్ నటించిన కోబ్రా సినిమా ఆగస్టు 31 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విక్రమ్ కు తెలుగులో కూడా మంచి గుర్తింపు ఉందన్న విషయం అందరికి తెలిసిందే. తెలుగులో తన అభిమానుల కోసం కోబ్రా సినిమాతో ముందుకు వచ్చారు.